Breaking News

బన్నీ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ‘తండేల్‌’ టీమ్‌.. నో ఎంట్రీ!

Published on Sun, 02/02/2025 - 16:33

‘సంధ్య థియేటర్‌’ ఘటన తర్వాత అల్లు అర్జున్‌ సినిమా ఈవెంట్లకు దూరంగా ఉన్నాడు. ఇంతవరకు ఏ సినిమా ఫంక్షన్‌కి కానీ, ఇతర ఈవెంట్స్‌కి కానీ రాలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ‘తండేల్‌’(Thandel) ప్రీరిలీజ్‌కి వస్తున్నాడు. ఈ వార్త వినగానే బన్నీ ఫ్యాన్స్‌ ఆనందంతో చిందులేశారు. తమ అభిమాన నటుడిని నేరు చూడొచ్చని చాలా మంది ఫ్యాన్స్‌ భావించారు. కానీ వారందరికి ‘తండేల్‌’ టీమ్‌ షాకిచ్చింది. ఈ రోజు(ఫిబ్రవరి 2) సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి పబ్లిక్‌కి ఎంట్రీ లేదని ప్రకటించింది. 

‘కొన్ని కారణాల రీత్యా దురదృష్టవశాత్తు ‘ఐకానిక్‌ తండేల్‌ జాతర’ను చిత్రబృందం సమక్షంలో మాత్రమే నిర్వహిస్తున్నాం. ఈవెంట్‌లోకి పబ్లిక్‌కు ఎలాంటి ప్రవేశం లేదు. ప్రసార మాధ్యమాల వేదికగా ఈ కార్యక్రమానికి సంబంధించిన లైవ్‌ వీక్షించి ఎంజాయ్‌ చేయండి’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశ‍కు గురయ్యారు. సోషల్‌ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. సంధ్య థియేటర్‌ ఘటన తర్వాత బన్నీ హాజరవుతున్న తొలి ఈవెంట్‌ ఇది. ఈ ఈవెంట్‌లో ఆయన ఏం మాట్లాడతారా? అని అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. . 

నాగచైతన్య, సాయి పల్లవి(Sai Pallav)i జంటగా నటించిన చిత్రం తండేల్‌.  ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా తండేల్‌ సాంగ్సే వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‌ కూడా అదిరిపోయింది. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఫిబ్రవిరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తండేల్‌ కథేంటి?
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ జాలరి కథ ఇది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాల‌రి   పొర‌పాటుగా పాకిస్థాన్ స‌ముద్ర‌జ‌లాల్లోకి ప్ర‌వేశించాడు. దీంతో పాక్‌ నేవి అధికారులు అరెస్ట్‌ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్‌ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. అయితే సినిమా మొత్తంలో పాకిస్తాన్‌ ఎపిసోడ్‌  కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందట. మిగతా కథంతా రాజు-బుజ్జితల్లి పాత్రల చుట్టే తిరుగుతుందట. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)