‘తండేల్‌’ సెన్సార్‌ టాక్‌.. బొమ్మ అదిరిందట!

Published on Thu, 01/30/2025 - 16:52

సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత రిలీజ్‌కు ముందే ఫుల్‌ పాజిటివ్‌ బజ్‌ ఏర్పాటు చేసుకున్న సినిమా తండేల్‌(Thandel Movie). నాగచైతన్య, సాయి పల్లవి(Sai Pallav)i జంటగా నటించిన ఈ చిత్రానికి ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా తండేల్‌ సాంగ్సే వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‌ కూడా అదిరిపోయింది. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఫిబ్రవిరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్‌ పూర్తయింది. మరి సెన్సార్‌ సభ్యులు ఇచ్చిన రిపోర్ట్‌ ఎలా ఉందో చూద్దాం.

 బ్లాక్‌ బస్టర్‌ పక్కా!
సెన్సార్‌ సభ్యులు ఈ సినిమా చూసి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాపై ‍ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదని, 'బ్లాక్ బస్టర్' పక్కా అని సెన్సార్‌ సభ్యులు తీర్పు ఇచ్చారట. ఇప్పటికే ఈ చిత్రంపై నిర్మాత అల్లు అరవింద్‌ ఫుల్‌ కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు. 'తండేల్'కు అల్లు అరవింద్ 100 కు వంద మార్కులు ఇచ్చారని గీతా ఆర్ట్ సంస్థ తెలిపింది. ఇక నాగచైతన్య కెరీర్‌లో భారీ కలెక్షన్స్‌ తెచ్చే చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని నిర్మాత బన్నీ వాసు మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు.

నిడివి ఎంతంటే.. 
తండేల్‌ సినిమాను చాలా క్రిస్పీగా కట్‌ చేశారట. అనవసరం సన్నివేశాలు లేకుండా కథను మాత్రమే ఎలివేట్‌ చేసేలా సీన్స్‌ ఉంటాయట. యాడ్స్‌తో కలిసి  2:32 గంటల నిడివి మాత్రమే ఉంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు కథనం ఎమోషనల్‌గా సాగుతుందని చిత్రబృందం తెలుపుతోంది.

తండేల్‌ కథేంటే..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ జాలరి కథ ఇది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాల‌రి   పొర‌పాటుగా పాకిస్థాన్ స‌ముద్ర‌జ‌లాల్లోకి ప్ర‌వేశించాడు. దీంతో పాక్‌ నేవి అధికారులు అరెస్ట్‌ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్‌ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. అయితే సినిమా మొత్తంలో పాకిస్తాన్‌ ఎపిసోడ్‌  కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందట. మిగతా కథంతా రాజు-బుజ్జితల్లి పాత్రల చుట్టే తిరుగుతుందట. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)