Breaking News

300 కోట్ల బడ్జెట్‌.. హీరోగాసూర్య లేదా చరణ్‌, నో చెప్పిన దర్శకుడు!

Published on Thu, 01/30/2025 - 15:15

చిత్ర పరిశ్రమలో విజయానికే విలువెక్కువ. ఎంత పెద్ద స్టార్‌ డైరెక్టర్‌ అయినా సరే..ఫ్లాప్‌ ఇస్తే మరో చాన్స్‌ రావడానికి చాలా సమయం పడుతుంది. గతంలో ఎన్ని రికార్డులు క్రియేట్‌ చేసినా సరే.. ప్లాప్‌ డైరెక్టర్‌తో సినిమా తీసేందుకు నిర్మాతలు కాస్త ఆలోచిస్తారు. అదే ఒక్క హిట్‌ పడితే చాలు కోట్ల అడ్వాన్స్‌ ఇచ్చి మరీ బుక్‌ చేసుకుంటారు. బడ్జెట్‌తో సంబంధం లేకుండా మాక్కూడా బ్లాక్‌ బస్టర్‌ అందించని ఎంత డబ్బులైనా ఇచ్చేస్తారు. కార్తికేయ 2 తర్వాత దర్శకుడు చందూ మొండేటి(Chandoo Mondeti )కి కూడా ఇలాంటి ఆఫరే వచ్చిందట. 300 కోట్ల బడ్జెట్‌ ఇస్తా.. రామ్‌ చరణ్‌, సూర్య లాంటి హీరోలను సెట్‌ చేస్తా భారీ సినిమా చెయ్‌ అని నిర్మాత అల్లు అరవింద్‌(Allu Aravind) అన్నారట.

కానీ ఆయన మాత్రం తండేల్‌(Thandel) కథనే చేస్తానని, అది కూడా నాగచైతన్యతోనే చేస్తానని చెప్పడంతో వారి ఆలోచనను విరమించుకున్నారట. ఈ విషయాన్ని తాజాగా చందు మొండేటి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.‘కార్తికేయ-2 తర్వాత గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయాల్సి వచ్చినపుడు.. తండేల్ కథ నా ముందుకు వచ్చింది. అయితే అల్లు అరవింద్‌, బన్నీవాసు ఆ కథ సినిమాకు సెట్‌ కాదని అనుకున్నారు. 

కార్తికేయ-2ను నేను హ్యాండిల్ చేసిన తీరు గురించి చెబుతూ పెద్ద సినిమా చేద్దామన్నారు. ‘మన దగ్గర సూర్య ఉన్నాడు, అలాగే రామ్ చరణ్ సైతం అందుబాటులో ఉన్నాడు. 300 కోట్ల దాక బడ్జెట్‌ ఇస్తాం. భారీ సినిమా ప్లాన్‌ చెయ్‌’ అని చెప్పారు. నీ నేను మాత్రం ‘తండేల్’ కథే ఎందకు చేయకూడదు అన్నాను. ఆ కథే నాకు ఎక్కువ నచ్చి దాన్నే చేయడానికి రెడీ అయ్యాను’ అని చందూ మొండేటి అన్నారు.


ఇక తండేల్‌ విషయానికొస్తే.. కార్తికేయ 2 తర్వాత చందు దర్శకత్వం వహించిన చిత్రమిది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్‌ కూడా సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)