Breaking News

విజయ్ 'లియో' ఫస్ట్‌లుక్.. ఇది గమనించారా?

Published on Thu, 06/22/2023 - 07:16

దళపతి విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పాజిటివో, నెగిటివో ఎప్పటికప్పుడు మన దగ్గర సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాడు. మరీ ముఖ్యంగా మన దగ్గర కొందరు నెటిజన్స్ ఇతడిని తెగ ట్రోల్స్ చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు విజయ్ హీరోగా నటిస్తున్న ఓ మూవీ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు.

లోకేష్ కనగరాజ్ పేరుకే తమిళ డైరెక్టర్. కానీ తెలుగులోనూ కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. 'ఖైదీ', 'విక్రమ్' సినిమాలే దీనికి కారణం.. ఈ రెండు చిత్రాల్ని లింక్ చేస్తూ LCU (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) సృష్టించాడు. ఇప్పుడు విజయ్ తో చేస్తున్న 'లియో' కూడా ఇందులో భాగమేనని అంటున్నారు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా లియో మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: హద్దులు దాటేస్తున్న తమన్నా.. 'లస్ట్ స్టోరీస్ 2'లో కూడా!)

ఈ పోస్టర్ లో విజయ్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నట్లు చూపించారు. వెనక మంచు కొండలు, ఓ తోడేలు, ఓ వ్యక్తి ఊడిన పళ్లు,  చేతిలో సుత్తి, దానితో పాటు గాల్లో రక్తం చూస్తుంటే.. విలన్ గ్యాంగ్ మనుషులు విజయ్ పై దాడి చేయడానికి వస్తే వాళ్లని తుక్కురేగ‍్గొట్టినట్లు కనిపిస్తుంది. గతంలో మూవీ నుంచి ఓ వీడియో రిలీజ్ చేసినప్పుడు టైటిల్ గోల్డ్ కలర్ లో ఉంది. ఈ ఫస్ట్ లుక్ లో మాత్రం రక్తంతో నిండిపోయింది.

అయితే విజయ్ తో పాటు ఈ ఫొటోలో ఉన్న పన్ను, రక్తంతో ఉన్న చేయి సంతానం(విజయ్ సేతుపతి) దే అని తెలుస్తోంది. విక్రమ్ లో సంతానం పాత్రని ఓ సారి గుర్తుచేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా స్పష్టత రావాలంటే మాత్రం ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చేయాల‍్సిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబరు 19న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం తెలుగు హక్కుల కోసం భారీ డిమాండ్ నెలకొంది. దాదాపు రూ.27 కోట్ల వరకు పలుకుతున్నాయని అంటున్నారు.

(ఇదీ చదవండి: ఆ బిజినెస్‌లో 'కేజీఎఫ్' విలన్ రూ.1000 కోట్ల పెట్టుబడి?)

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)