Breaking News

భలే చాన్స్‌

Published on Sun, 01/04/2026 - 00:09

ప్రముఖ నటుడు రజనీకాంత్‌ని డైరెక్ట్‌ చేసే భలే చాన్స్‌ అందుకున్నారు యువ దర్శకుడు శిబి చక్రవర్తి. రజనీకాంత్‌ నటించనున్న 173వ చిత్రం గురించి ఇటీవల పలు వార్తలు ప్రచారం అయిన విషయం తెలిసిందే. నటుడు కమల్‌హాసన్  తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించనున్నారు. ఈ మూవీకి సుందర్‌. సి దర్శకత్వం వహించనున్నట్లు తొలుత ప్రకటన వెలువడింది. కమల్‌హాసన్, రజనీకాంత్‌తో సుందర్‌.సి కలిసి ఉన్న ఫోటోలను కూడా రిలీజ్‌ చేశారు. అయితే ఈ చిత్రం నుంచి సందర్‌ వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.

ఆ తర్వాత ఈ మూవీకి ‘డ్రాగన్ ’ ఫేమ్‌ అశ్వద్‌ మారిముత్తు  దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు శిబి చక్రవర్తి తెరపైకి వచ్చారు. శివ కార్తికేయన్  హీరోగా ‘డాక్టర్, డాన్ ’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారాయన. నిజానికి ఇంతకుముందే రజనీ కోసం ఓ మంచి కథను సిద్ధం చేశారు దర్శకుడు. కాగా రజనీకాంత్‌ చిత్రానికి శిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్లు కమల్‌హాసన్  శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ సినిమాని 2027 పొంగల్‌కి విడుదల చేస్తామని కమల్‌ పేర్కొన్నారు. – సాక్షి సినిమా, చెన్నై

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)