Breaking News

ఇండస్ట్రీని లూటీ చేస్తున్నారు 

Published on Thu, 11/20/2025 - 05:46

‘‘తెలుగు పరిశ్రమలోని ముగ్గురు నిర్మాతలు  చేస్తున్న నిర్వాకాల వల్ల చిన్న సినిమా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది’’ అన్నారు తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌. టీఎఫ్‌సీసీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మహాధర్నాలో రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ– ‘‘సినిమాను థియేటర్‌లో ప్రదర్శించే డిజిటల్‌ కంటెంట్‌ ప్రొవైడర్స్‌ ‘క్యూబ్, యూఎఫ్‌వో, పీఎక్స్‌ డీ’ తెలుగు నిర్మాతల నుంచి థియేటర్లలో ప్రదర్శనకు వారానికి రూ. పది వేలు, మల్టీప్లెక్స్‌లో వారానికి 15 వేలు వసూలు చేస్తున్నారు. 

ఇతర రాష్ట్రాల్లో ఈ చార్జీలు రూ. 2500 నుంచి 3 వేల రూపాయలు మాత్రమే. ఇండస్ట్రీలోని ముగ్గురు నిర్మాతలు ఈ డిజిటల్‌ ప్రొవైడింగ్‌ కంపెనీల్లో భాగస్వామ్యంగా ఉంటూ తెలుగు పరిశ్రమను లూటీ చేస్తున్నారు. థియేటర్స్‌లో తినుబండారాల ధర, టికెట్‌ రేట్లు భారీగా ఉంటున్నాయి. దీంతో సామాన్య ప్రేక్షకుడు చిన్న సినిమాను థియేటర్స్‌లో చూసేందుకు రావడం లేదు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు. ఎత్తరి గురురాజ్, సాయి వెంకట్, డీఎస్‌ రెడ్డి, రవి, సన్నీ, సిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)