Breaking News

యాసలందు అన్ని యాసలూ లెస్స

Published on Sat, 06/24/2023 - 00:25

ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ‘యాస’ల ట్రెండ్‌ నడుస్తోంది. పాత్రలకు తగ్గట్టు స్టార్స్‌ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల యాసలు పలకడానికి ‘యస్‌’ చెబుతున్నారు. ఏ యాసకి ఆ యాస ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించడానికి ఉపయోగపడుతోంది. అందుకే ‘యాసలందు అన్ని యాసలూ లెస్స’ అని చెప్పాలి. ప్రస్తుతం ‘పుష్ప 2, హరోం హర’తో పాటు విశ్వక్‌ సేన్‌ చిత్రం, అనన్య నాగళ్ల మూవీ వంటి పలు సినిమాలు ఆయా ప్రాంత యాసల నేపథ్యంలో రూపొందుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేద్దాం.

పుష్పగాడి రూలు
‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు’...  ‘తగ్గేదే లే’ అంటూ ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’లో హీరో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌ ఎంత పాపులర్‌ అయిందో చెప్పక్కర్లేదు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో హిట్‌ అయింది. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్‌ సహా దాదాపు అన్ని పాత్రలు రాయలసీమలోని చిత్తూరు యాసలో మాట్లాడతాయి. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప 2: ది రూల్‌’ కూడా చిత్తూరు యాసలో రూపొందుతోంది. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఇక ‘అడవిలో జంతువులు రెండడుగులు ఎనక్కి ఏసినాయంటే పులి వచ్చుండాదని అర్థం.. అదే పులి రెండడుగులు ఎనక్కి ఏసినాదంటే పుష్ప వచ్చుండాడని అర్థం’, ‘పుష్పగాడి రూలు’ వంటి డైలాగులు ‘పుష్ప 2: ది రూల్‌’ గ్లింప్స్‌లో ఉన్నాయి.  

ఇంగ సెప్పేదేం లేదు.. సేసేదే
సుధీర్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో సుమంత్‌ జి. నాయుడు నిర్మిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన 1989 నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్‌లో ‘సుబ్రహ్మణ్యం అన్న.. జనాలు నీ కోసం సూస్తా ఉండారు.. అట్లా కదలకుండా ఉంటే ఎట్లా.. ఏందోకటి సెప్పు’, ‘ఇంగ సెప్పేదేం లేదు.. సేసేదే’ వంటి చిత్తూరు యాస డైలాగులు వినిపించాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా డిసెంబర్‌ 22న విడుదల కానుంది

బ్లాక్‌.. వైట్‌ ఉండదు..  
‘సామాజిక నిబంధనలను ధిక్కరించే ప్రపంచంలో బ్లాక్‌ ఉండదు, వైట్‌ ఉండదు, గ్రే మాత్రమే ఉంటుంది’ అంటూ ‘వీఎస్‌ 11’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం వీడియో రిలీజ్‌ అయింది. విశ్వక్‌ సేన్‌ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడిక్‌ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో విశ్వక్‌ సేన్‌ గోదావరి యాసలో మాట్లాడతారు.

శ్రీకాకుళం యాసతో...  
అనన్య నాగళ్ల, రవి మహాదాస్యం జంటగా ‘వెన్నెల’ కిశోర్‌ కీలక పాత్రలో రాజా రామ్మోహన్‌ చల్లా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. బేబీ లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కథాంశం శ్రీకాకుళం యాస నేపథ్యంలో సాగుతుంది.   

నెల్లూరి నెరజాణ
డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన చిగురుపాటి సుబ్రమణ్యం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నెల్లూరి నెరజాణ’. ఎంఎస్‌ చంద్ర, హరి హీరోలుగా, అక్షా ఖాన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం పక్కా నెల్లూరు యాసలో రూపొందినట్లు చిగురుపాటి సుబ్రమణ్యం తెలిపారు.  

ఇవే కాదు.. మరికొన్ని చిత్రాల్లో కూడా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ యాస వినిపించనుంది.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)