AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!
Breaking News
8k వర్షన్లో ఎన్టీఆర్- జాన్వీ కపూర్ వీడియో సాంగ్
Published on Fri, 06/13/2025 - 08:20
దేవరలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) రొమాంటిక్ స్టెప్పులతో ‘చుట్టమల్లే’ అంటూ యువతను బాగా చుట్టేసుకుంది. ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘దేవర’లో ఈ పాటకు ఫ్యాన్స్ ఎక్కువే అని చెప్పవచ్చు. తాజాగా 'చుట్టమల్లే' పాటను 8k వర్షన్లో ఉన్న వీడియోను విడుదల చేశారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల నుంచి పలు సాంగ్స్ 8k వర్షన్లో విడుదలయ్యాయి. దసరా, స్త్రీ2, గేమ్‌ఛేంజర్, రైడ్2 వంటి చిత్రాలతో పాటు కొన్ని పాత సినిమాల నుంచి కూడా సరికొత్తగా 8k వర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రస్తుతం 4K వీడియోలోనే ఎక్కువ పాటలు ఉంటున్నాయి. అయితే, ఇప్పుడు 8k వర్షన్లో విడుదల చేస్తున్నారు. దీంతో 4K వీడియో కంటే ఎక్కువ రిజల్యూషన్‌తో నాణ్యత ఉంటుంది. 8k వీడియో చూడటం వల్ల మీరు మరింత స్పష్టమైన. పదునైన విజువల్స్‌ను అనుభవించవచ్చు. 8k వీడియోలను పెద్ద స్క్రీన్లలో లేదా డిస్ప్లేలలో చూడటం ద్వారా వాటిని మరింత బాగా ఆస్వాదించవచ్చు. 4k రిజల్యూషన్ 3840 x 2160 పిక్సెల్స్ (pixels) అయితే, 8k రిజల్యూషన్ 7680 x 4320 పిక్సెల్స్‌గా ఉంటుంది.
Tags : 1