Breaking News

ఐటీ ఎంప్లాయీస్ కన్నా సినీ కార్మికుల జీతాలే ఎక్కువ: ప్రసన్న కుమార్‌

Published on Tue, 08/05/2025 - 14:35

‘పేద సినీ కార్మికులకు మేము వ్యతిరేకం కాదు. వారికి ఎప్పుడు అండగానే ఉంటాం’ అన్నారు నిర్మాత మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్‌. తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలంటూ తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు డిమాండ్‌ చేస్తూ, సోమవారం నుంచి బంద్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. యూనియన్‌ డిమాండ్స్‌ని ఫిలిం ఛాంబర్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు చర్చలు జరిపారు. 

అనంతరం ప్రసన్న కుమార్‌ మీడియాతో మట్లాడుతూ..‘‘ఫిలిం ఛాంబర్‌తోనే ‘మా’ అసోసియేషన్‌ కలిసి వెళ్తుందని మంచి విష్ణు చెప్పారు. పేద సినీ కార్మికులకు మేము ఎప్పుడూ అండగానే ఉంటాం. లేబర్‌ యాక్ట్‌ ప్రకారం నిర్మాతలు ఒక్కో కార్మికుడికి భారీగానే వేతనం చెల్లిస్తుంది. ఐటీ ఎంప్లాయీస్ కన్నా యూనియన్ కార్మికులకు జీతాలు ఎక్కువ ఉన్నాయి. ఏడెనిమిది లక్షల రూపాయలు చెల్లిస్తేనే యూనియన్‌లో సభ్యత్వం ఇస్తున్నారు. మా కార్మికులతోనే పని చేయాలి అని యూనియన్ వాళ్ళు చెప్పడం తప్పు.

కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ని కూడా ధిక్కరించి సమ్మెకు పిలుపు నిచ్చారు.ఫెడరేషన్ వాళ్ళవి ఏకపక్ష నిర్ణయాలు.మేం చట్టంపరంగా న్యాయంగా వెళ్తున్నాం. నిర్మాతల పరిస్థితే బాగోలేదు. ఇలాంటి సమయంలో సమ్మె చేయడం సరికాదు. కార్మికులు కూడా మాతో కలిసి వస్తారని ఆశిస్తున్నాం. స్వార్థ పూరిత విధానాలతో కాకుండా అందరం ఒక కుటుంబం లాగా కలసి చర్చించుకుందాం’ అని అన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)