చట్టప్రకారం చిరంజీవి దరఖాస్తు పరిష్కరించండి: హైకోర్ట్‌

Published on Tue, 07/15/2025 - 13:01

మెగాస్టార్‌ చిరంజీవి తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని కొద్దిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, తాజాగా జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.  చట్ట ప్రకారం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్‌లో ఉన్న చిరు ఇల్లు పునరుద్ధరణ చర్యల్లో భాగంగా రిటెయిన్‌ వాల్‌ క్రమబద్ధీకరణకు జూన్‌ 5న జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. కానీ, అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదంటూ చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఇటీవల విచారణ జరిపారు. 

చిరంజీవి తరఫు న్యాయవాది వాదనల ప్రకారం.. 2002లో అనుమతి తీసుకుని జీ+2 ఇంటిని చిరు నిర్మించారని తెలిపారు. అయితే, పునరుద్ధరణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అనుమతులు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో చిరు ఇంటి నిర్మాణాన్ని తనిఖీ చేసి క్రమబద్ధీకరించాలని కోరినా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోలేదని కోర్టుకు ఆయన తెలిపారు. చిరంజీవి దరఖాస్తును నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీని అధికారులను హైకోర్ట్‌ ఆదేశించింది.

#

Tags : 1

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)