Breaking News

హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్.. యూట్యూబర్‌కు భారీ ఊరట!

Published on Wed, 10/30/2024 - 17:40

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్‌ హర్షసాయికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. తనపై పెట్టిన కేసు చెల్లదంటూ హర్షసాయి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. హర్షసాయికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.


లైంగికంగా వేధించాడని కేసు
హర్షసాయి తన దగ్గర రూ. 2 కోట్లు తీసుకోవడంతో పాటు లైంగికంగా వేధించాడంటూ ఓ నటి పోలీసులను ఆశ్రయించారు. దీంతో సెప్టెబర్‌ 24న హర్షసాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి హర్షసాయి పరారీలోనే ఉన్నాడు.తను ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయంగా పోరాడడానికి తాను సిద్ధమని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. ఆ తర్వాత హర్ష సాయి ఎక్కడా కనిపించలేదు. పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన ఫలితం లేకుండా పోయింది. అజ్ఞాతంలో ఉండే..ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నం చేశాడు.

‘మెగా’ విషయంలో విభేదాలు
గుడ్‌ మెసేజ్‌.. హెల్పింగ్‌ హ్యాండ్‌ తరహా వీడియోలతో హర్షసాయి తెలుగు స్టేట్‌లోనే కాకుండా సౌత్‌లోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. తాజాగా సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. ఆయన హీరోగా ‘మెగా’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ కాపీరైట్స్‌ విషయంలోనే విభేదాలు రావడంతో సదరు నటి హర్షసాయిపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ‘మెగా’ కాపీరైట్స్‌ కోసమే లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో పాటు ఆయన తండ్రిపై కూడా ఫిర్యాదు చేసింది. . దీంతో అప్పటి నుంచే వారిద్దరు ముందస్తు బె​యిల్‌ కోసం ప్రయత్నాలు చేయగా.. ఇన్నాళ్లకు వారి ప్రయత్నం ఫలించింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)