Breaking News

అందుకే పెళ్లి చేసుకోవడం మానేశా : తేజస్వి మదివాడ

Published on Sun, 08/14/2022 - 17:50

బిగ్‌బాస్ ఫేమ్‌ తేజస్వి మదివాడ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం కమిట్‌మెంట్‌. నాలుగు ఇంట్రెస్టింగ్‌ కథలతో తెరకెక్కిన ఈ మూవీని రచనా మీడియా వర్క్స్‌ సమర్పణలో, ఎఫ్‌3 ప్రొడక్షన్స్‌, ఫుట్‌ లూస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. లక్ష్మీ కాంత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్వేషి జైన్‌, సీమర్ సింగ్‌, తనిష్క్‌ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్‌, అభయ్‌ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్‌ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తేజస్వీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

ఈ సినిమాలో నాలుగు స్టోరీలు ఉన్నాయి అందులో ఒకటి నాది. ఇందులో నా క్యారెక్టర్ సినిమా చాన్స్ అవకాశాల  కోసం తిరిగేది.ఇండస్ట్రీ లో జరిగే న్యాచురాలిటీ కి దగ్గర గా ఈ సినిమా ఉంటుంది . అందుకే ఈ స్టోరీ వినగానే ఓకే చేశాను . సినిమా ఇండస్ట్రీని బద్నామ్‌ చేయొద్దు అని చెప్పేదే ఈ మూవీ మెసేజ్‌. కమిట్‌మెంట్‌ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇది చాలా డిఫరెంట్‌ మూవీ. ఇందులో ప్రతిదీ నేచురల్‌గా ఉంటుంది. 

ఒక సినిమా కి ఎంత అవసరం ఉంటుందో అంతే చేయాలి. బోల్డ్ అయినా కిస్ సీన్ అయినా కంటెంట్ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తాను . ఈ సినిమాలోనూ రొమాన్స్‌ ఉంటుంది. ఈ మూవీలో శ్రీనాథ్‌ నాతో రొమాన్స్‌ సీన్స్‌ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు(నవ్వుతూ..)

ఇండస్ట్రీలో నన్ను ఎవరూ కమిట్‌మెంట్‌ అడగలేదు. అందరూ నాతో కూల్‌గానే ఉన్నారు. నన్ను కమిట్‌మెంట్‌ అడగాలి అంటే బయపడేవాళ్లు . ఇప్పటికీ వరుస అవకాశాలు వస్తున్నాయి కానీ.. చాలా మంది అక్క, చెల్లి క్యారెక్టర్స్‌ అని చెబుతున్నారు. లేదంటే బోల్డ్‌ క్యారెక్టర్స్‌ తీసుకొస్తున్నారు. ‘కేరింత’లాంటి క్యారెక్టర్స్‌ ఎవరూ ఇవ్వడం లేదు(నవ్వుతూ)

సినిమాలు మానేసి పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు అన్నారు. అందుకే పెళ్లి చేసుకోవడం మానేశా(నవ్వుతూ..)

బిగ్‌బాస్‌లోకి వెళ్లడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఆ షో కారణఃగానే ఇల్లు, కారు కొనుక్కొని హ్యాపీగా ఉన్నాను. బిగ్‌బాస్‌లోకి వెళ్లడం వల్ల ఆఫర్స్‌ మిస్‌ అయ్యాయని ఎవరైనా అంటే కూడా ఐ డోంట్‌ కేర్‌. , సినిమా ఇండస్ట్రీ కి వచ్చిందే మనీ కోసం. నేను చాల స్మార్ట్.. లైఫ్‌ని  ఎలా  రన్ చేయాలో  బాగా తెలుసు. 

ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ చిత్రంలోనూ నటిస్తున్నాను. ఇతర భాషల నుంచి కూడా ఆఫర్స్‌ వస్తున్నాయి. 

Videos

YSR విగ్రహానికి ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో అక్రమ కేసులు

Manohar: కోర్టు తీర్పులను ఉల్లంఘించిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం

Khammam: ఏవో తాజుద్దీన్ హామీతో ధర్నాను విరమించిన రైతులు

ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు DAలు పెండింగ్ లో ఉన్నాయి: హరీశ్ రావు

ఆరావళి పాత తీర్పుపై.. సుప్రీం స్టే..

బోగస్ మాటలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి: వైఎస్ అవినాష్రెడ్డి

ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడం లేదు: బీర్ల ఐలయ్య

అమెరికాలో తెలంగాణ స్టూడెంట్స్ మృతి

ఉన్నావ్ కేసులో సుప్రీం షాక్.. నిందితుని బెయిల్ పై స్టే..

మా నాయకుడు జగన్ అని గర్వంగా చెప్తాం రాచమల్లు గూస్ బంప్స్ కామెంట్స్

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)