amp pages | Sakshi

సింగర్‌కు షాక్.. ఆ పని చేయలేదని భారీ జరిమానా!

Published on Wed, 07/05/2023 - 16:22

ప్రముఖ హాలీవుడ్ సింగర్, గేయ రచయిత టేలర్ స్విఫ్ట్‌కు న్యూయార్క్ మున్సిపల్ అధికారులు షాకిచ్చారు. ఆమెకు తన ఇంటిముందు ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచలేదని ఏకంగా 2.4 లక్షల జరిమానా విధించారు. అయితే ఆమెకు ఇప్పటికే అధికారులు 32 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని వెల్లడించారు. అయితే ఈ జరిమానాలు మొత్తం ఐదేళ్ల కాలానికి సంబంధించినదిగా తెలుస్తోంది. ఆమె భవనం ముందు చెత్త ఉంచినందుకు జనవరి 2018 నుంచి 2023 వరకు  పలుసార్లు ఫైన్ విధించారు.

(ఇది చదవండి: నిహారిక-చైతన్యల విడాకులు.. ముందుగా పిటిషన్‌ వేసింది ఎవరంటూ..)

టేలర్ తన మూడు అంతస్తుల భవనం ముందు చెత్తను సరిగా తీసివేయడం లేదని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికి మీడియా కథనం ప్రకారం  టేలర్ ఇంటి వెలుపల వార్తాపత్రికలు, సీసాలు, కార్డ్‌బోర్డ్, నాప్‌కిన్స్ కుప్పలు కుప్పలుగా పేరుకుపోయినట్లు తెలుస్తోంది. వాటితో పాటు చెల్లా చెదురుగా పడి ఉన్న యాష్‌ట్రేలు, సిగరెట్ కార్టన్ కూడా ఉన్నాయని నివేదికలో పేర్కొంది. అయితే పలువురు అభిమానులు మాత్రం అధికారుల తీరును తప్పుబడుతున్నారు. ఆమెకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని చెబుతున్నారు. టేలర్ సిగరెట్స్, మందు తాగడం చేయదని అంటున్నారు. 

(ఇది చదవండి: బేబీ డైరెక్టర్‌కు బ్రో షూ గిఫ్ట్‌.. వేలల్లో కాదు లక్షల్లో!)

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)