Breaking News

తారకరత్న పెద్దకర్మ తేదీ ప్రకటన.. ఎప్పుడంటే?

Published on Sat, 02/25/2023 - 23:39

నందమూరి తారకరత్న మరణం టాలీవుడ్‌ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న మరణం కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. భర్త దూరం కావడంతో పిల్లలతో పాటు భార్య అలేఖ్య రెడ్డి తీవ్రం విషాదంలో మునిగిపోయింది. పుట్టినరోజుకు మూడు రోజుల ముందే ఆయన కన్నుమూయడంతో ఆమె మరింత విషాదం నెలకొంది. గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులోని ఆస్పత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. 

ఇటీవలే తారకరత్న చిన్న కర్మ కూడా నిర్వహించారు.  తారకరత్న మరణం తర్వాత నందమూరి బాలకృష్ణ దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు. అలాగే పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని వెల్లడించారు. తాజాగా తారకరత్న పెద్ద కర్మ తేదీని కూడా ప్రకటించారు ఆయన కుటుంబ సభ్యులు. ఎంపీ విజయసాయి రెడ్డి, బాలకృష్ణ అంత్యక్రియలు ముగిసేంత వరకూ దగ్గరుండి చూసుకున్నారు. తారకరత్న భార్య విజయ సాయిరెడ్డికి బంధువు కావడంతో దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. 

అలాగే బాలకృష్ణ, విజయసాయిరెడ్డి పెద్ద కర్మను దగ్గరుండి పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన కార్డును సోషల్ మీడియాలో షేర్ చేశారు. తారకరత్న కుటుంబ సభ్యులు కార్డుని ప్రింట్ చేయించారు. మార్చి 2న తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో తారకరత్న పెద్ద కర్మ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్డుపై నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య, వారి పిల్లలు నిషిక, తనయ్ రామ్, రేయ పేర్లను ప్రచురించారు. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)