Breaking News

అలా చేస్తే ఆర్‌ నారాయణమూర్తి ఇప్పటికీ నెంబర్‌ వన్‌ స్టార్‌గానే ఉండేవాడు

Published on Tue, 04/18/2023 - 12:47

ఆర్‌ నారాయణ మూర్తి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి తెలిసిందే. విప్లవ సినిమాలు తీస్తూ పీపుల్స్‌ స్టార్‌గా ఎదిగాడు.  కేవలం సినిమాల్లో నటించడమే కాదు.. కథ, కథనం, దర్శకత్వం, సంగీతం, గానం, నిర్మాణం..ఇలా 24శాఖలను తన భూజన వేసుకొని సూపర్‌ హిట్‌ చిత్రాలను అందించగల సమర్థుడు. ఈ మధ్యకాలంలో ఆయనకు సరైన హిట్‌ పడలేదు కానీ,  ఒకప్పుడు ఆయన సినిమాలు టాలీవుడ్‌లో సంచలనం సృష్టించాయి. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అలాంటి గొప్ప నటుడిపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నమ్మిన సిద్దాంతం కోసం స్టార్‌డమ్‌ని, కోట్ల రూపాయలను వదులుకున్న ఏకైన నటుడు ఆర్‌ నారాయణమూర్తి అని ప్రశంసించారు. తాజాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాకు  ఒక డిఫరెంట్ స్టేటస్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆర్‌ నారాయణమూర్తి. విప్లవాన్ని నమ్ముకొని.. విప్లవం కోసమే జీవితాన్ని అంకితం చేశాడు. 

తన కథలతో ప్రేక్షకుల ఆలోచనలు ప్రభావితం చేస్తూ, కొంతకాలం పాటు అతనే నెంబర్ వన్ స్టార్ అయ్యాడు కూడా. స్టార్ డమ్ వచ్చిన తరువాత కూడా తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదలకుండా అదే తరహా సినిమా చేస్తూ వచ్చాడు. సిద్దాంతం కోసం తన స్టార్‌ స్టేటస్‌ని వదులుకున్నాడు కానీ తన పంథా మార్చుకోలేదు. తన పంథా మార్చుకొని ఉంటే ఈ రోజుకి కూడా ఆర్‌ నారాయణమూర్తి నెంబర్‌ వన్‌ స్టార్‌గానే ఉండేవాడు. 

‘మీ సిద్ధాంతం వదలకుండా మీరు సినిమా చేసే విధానం మార్చుకోండి’ అని నేను చాలాసార్లు చెప్పానుగానీ ఆయన వినిపించుకోలేదు. ఆయన ఏ సినిమా తీసినా అది విప్లవ పంథాలోనే ఉంటుంది. సూపర్ హిట్లు ఇచ్చాడు .. ఎంతో సంపాదించాడు. అయినా రోడ్లపై నడుచుకుంటూనే తిరుగుతూ ఉంటాడు. అంత సింపుల్ గా బ్రతికే మనిషిని గురించి ఎంత చెప్పినా సరిపోదు’ అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)