Breaking News

లియో మూవీ రిలీజ్ వివాదం.. కొనసాగుతున్న సస్పెన్స్!

Published on Wed, 10/18/2023 - 13:14

తమిళ స్టార్ హీరో విజయ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో 7 స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌ నిర్మించారు. ఈ చిత్రం గురువారం థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ మూవీ రిలీజ్‌పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.  ముఖ్యంగా విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. థియేటర్లలో ఆటలు ప్రదర్శన వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. లియో చిత్రానికి ప్రభుత్వం 19వ తేదీ నుంచి 24వ తేది వరకు రోజుకు 5 ప్రదర్శనలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

అయితే మరో ఆటను వేకువజామున 4 గంటలకు అనుమతి కోరుతూ చిత్ర నిర్మాత ఎస్‌ ఎస్‌.లలిత్‌ కుమార్‌ చైన్నె హైకోర్టును ఆశ్రయించగా.. అనుమతి ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఉదయం 9 గంటల ఆటకు బదులు 7 గంటలకు అనుమతించే విషయంపై పరిశీలించాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. కాగా మరో పక్క సినీ డిస్ట్రిబ్యూటర్లు తమకు 5 ఆటలు చాలని ప్రకటించడం మరోవైపు ఆసక్తికరంగా మారింది.

ప్రభుత్వం మారినా..?

ఇదిలా ఉంటే విజయ్‌ చిత్రం అంటేనే సమస్యలు తలెత్తుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో విజయ్‌ నటించిన చిత్రాలు ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటికీ అదే పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ప్రచారం ముమ్మరంగా జరుగుతుండడమేనని తెలుస్తోంది. ఇదే విషయాన్ని మంగళవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి రఘుపతిని మీడియా ప్రశ్నించింది.

లియో చిత్రం విషయంలో రాజకీయం ఉందనే ప్రచారం జరుగుతోందని.. రాజకీయాల్లో కొనసాగుతున్న కొందరు నిర్మిస్తున్న చిత్రాలకు ఎలాంటి సమస్యలు లేకుండా అనుమతిస్తున్నారనే విమర్శకు మీ సమాధానం ఏమిటన్న ప్రశ్నకు చిత్ర పరిశ్రమ విషయంలో విభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదని ఆయన బదులిచ్చారు. చిత్ర పరిశ్రమతో తమకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. అదే సమయంలో ప్రజల రక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

కాగా.. న్యాయస్థానంలో ఉపశమనం లభించకపోవడంతో లియో చిత్ర నిర్మాత రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని కలిశారు. ఈ క్రమంలో రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ అముదను కలవడానికి వచ్చిన నిర్మాత తరపు న్యాయవాదుల కారు యాక్సిడెంట్‌కు గురైంది. తిరుగుముఖం పట్టిన న్యాయవాదుల కారును డ్రైవర్‌ మలుపు తిప్పుతుండగా అటుగా వస్తున్న మహిళ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. లియో చిత్రం గురువారం విడుదల అని ప్రకటించినా ఇప్పటి వరకు చాలా థియేటర్లో అడ్వాన్స్‌ బుకింగ్స్ జరగకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ చిత్ర విడుదలపై సందిగ్ధత నెలకొంది.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)