Breaking News

అపాయింట్‌మెంట్‌ అడిగితే షాకయ్యారు.. విశాల్ కామెంట్స్ వైరల్!

Published on Fri, 09/15/2023 - 17:01

కోలీవుడ్ హీరో విశాల్ తాజాగా నటించిన చిత్రం మార్క్ ఆంటోనీ.  తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్‌ అయింది. అభినయ, రీతూ వర్మ హీరోయిన్స్‌గా నటించారు. ఈ చిత్రానికి అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించారు.  ఎస్‌జే సూర్య, సెల్వరాఘవన్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఎస్‌. వినోద్‌ కుమార్‌ నిర్మించారు. ‍అయితే తాజాగా మార్క్‌ ఆంటోనీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న విశాల్.. కోలీవుడ్‌ స్టార్‌ హీరో గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ హీరో తనకు చాలా కాలం నుంచి తెలుసు.. అంతే కాదు అతను ఎదుర్కొన్న విమర్శలు కూడా తెలుసని వెల్లడించారు. కోలీవుడ్‌ స్టార్, తన మిత్రుడైన దళపతి విజయ్ గురించి విశాల్‌ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. 

(ఇది చదవండి: అక్కడ సూపర్‌ హిట్‌.. తెలుగులో రిలీజ్‌ కానున్న మూవీ!)

విశాల్ మాట్లాడుతూ..' నా స్నేహితుడు విజయ్‌తో ఓ సినిమా చేయాలనేది నా కల. అది త్వరలోనే నెరవేరాలని కోరుకుంటున్నా. ఈ విషయంపై ఇప్పటికే అతనితో చర్చించా. కొన్ని రోజుల క్రితం విజయ్‌ మేనేజర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడా. కథ చెప్పేందుకు అపాయింట్‌మెంట్‌ అడిగా. దీంతో విజయ్ మేనేజర్‌ షాక్‌ అయ్యాడు. కాలేజీ రోజుల నుంచే విజయ్‌ నాకు తెలుసు. విజయ్ ఎంట్రీ ఇచ్చిన కొత్తలో.. ఈ మొహాన్ని డబ్బులిచ్చి మరీ థియేటర్‌ వెళ్లి ఎవరైనా చూడాలనుకుంటారా?’ అంటూ ఓ మ్యాగజైన్‌లో వార్తలు రాశారు.

ఆ విమర్శలనే సవాల్‌గా తీసుకున్న విజయ్ ఇండస్ట్రీలో ఎదిగారు. కొన్నేళ్ల తర్వాత అదే మ్యాగజైన్‌లో విజయ్ బ్లాక్‌బస్టర్‌ సినిమాలపై కథనాలు వచ్చాయి. అది దళపతి విజయ్‌ పవర్.' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. ఇటీవలే తమిళ నిర్మాతల  సంఘం విశాల్‌తో సహా మరో ముగ్గురు స్టార్ హీరోలకు రెడ్‌ కార్డ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 

(ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్‌ థ్రిల్లర్‌, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?)

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?