Breaking News

నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య

Published on Mon, 02/23/2026 - 13:07

తమిళనాడులో దారుణం జరిగింది. ప్రముఖ నటి విష్ణుప్రియ తండ్రి సూర్యనారాయణ(73) హత్యకు గురయ్యారు. ఈ విషయం ఇప్పుడు కలకలం సృష్టించింది. కొందరు దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అలానే మృతుడి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఉంగరం లాంటి విలువైన వస్తువులు తీసుకుని పరారయ్యారు.

సూర్యనారాయణ.. కొడైక్కెనాల్ సమీపంలోని కురించి ఆండవర్ కోయిల్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈయనకు అక్కడే ఓ పెద్ద బంగ్లా కూడా ఉంది. అందులో ఆరుముగం, మురళి అనే ఇద్దరు పనివాళ్లు కూడా ఉన్నారు. రెండురోజుల క్రితం విహారయాత్ర కోసం అని వచ్చిన ఐదుగురు వ్యక్తులు.. దగ్గరలో బసకు దిగారు. శనివారం రాత్రి, బంగ్లా దగ్గరకు వచ్చిన వ్యక్తులు.. పనిమనుషులని చితకబాదారు. తర్వాత సూర్యనారాయణ ముఖానికి టేప్ చుట్టి దారుణంగా హింసించారు. ఈ క్రమంలోనే ఆయన ఊపిరాడక చనిపోయారు.

సూర్యనారాయణని హత్య చేసిన అనంతరం ఆయన మెడలోని బంగారు గొలుసు, ఉంగరంతో పాటు సీసీటీవీల హార్ట్ డిస్క్‌లు తీసుకుని పరారయ్యారు. కాగా సూర్య 'మాయావి' సినిమాలో సహాయ నటిగా చేసిన విష్ణుప్రియ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. 2018లో ఈమెని ప్రేమించిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇప్పుడు సూర్యనారాయణ హత్యకు.. అప్పటి హత్యకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Videos

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)