Breaking News

విజయ్‌కి వ్యతిరేకంగా బీచ్‌లో నటి పోరాటం

Published on Thu, 04/16/2026 - 09:34

తమిళనాడులో జల్లికట్టు ఆందోళన ద్వారా ప్రసిద్ధి చెందిన బుల్లి తెర నటి జూలీ, తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ్‌కి వ్యతిరేకంగా చెన్నై మెరీనా బీచ్‌లో అనుమతి లేకుండా నిరసన తెలిపిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పటికే పెరంబూరు నియోజకవర్గంలో విజయ్‌ను విమర్శిస్తూ ప్రచారం చేసిన జూలీ తాజాగా  మెరీనా ఔవయ్యార్‌ విగ్రహం వద్ద తన మద్దతుదారులతో కలిసి ఆకస్మికంగా నిరసనలో పాల్గొన్నారు. 

ఒక చేతిలో డీఎంకేకు ఓటు వేయండి అనే బ్యానర్‌ను, మరో చేతిలో విజయ్‌ను ఉద్దేశించి ఉడుత బొమ్మ వేసి దానిపై ’ఎక్స్‌’ గుర్తు వేసిన బ్యానర్‌ను పట్టుకుని  నినాదాలు చేశారు. ముఖ్యంగా, తమిళగ వెట్రికళగం ద్వారా మహిళలకు రక్షణ లేదు అనే  వాక్యం ఉన్న ప్లకార్డును జూలీ పట్టుకోవడం విజయ్‌ అభిమానులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. సమాచారం అందుకున్న మెరీనా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో నిరసన తెలిపిన జూలీతో సహా  నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎన్నికల సమయంలో సరైన అనుమతి లేకుండా ప్రచారం చేయకూడదని సూచించిన పోలీసులు, ఆమె నుంచి క్షమాపణ లేఖ రాయించుకుని విడుదల చేశారు.  

Videos

"ఎవడైతే నాకేంటి" లో నటించమని వైఎస్ జగన్ గారిని అడిగితే, ఏమన్నారంటే..!

Breaking News: పూడి శ్రీహరికి బెయిల్

BC నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి.. కీలక సమావేశం

Delhi Airport: ఢీకొన్న రెండు విమానాలు

వడదెబ్బకు విరుగుడు! ఈ 3 తింటే సేఫ్ .. బాడీని కూల్ చేసే ఫుడ్స్

హీరోలు అంత ఫిట్ గా ఎలా ఉంటున్నారో తెలుసా? వీరి డైట్ ప్లాన్ చూస్తే షాక్ అవుతారు!

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు వల్లభనేని వంశీ ఫిర్యాదు

మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయం చేయొద్దు

LIVE:లష్కరే టాప్‌ కమాండర్‌పై కాల్పులు...

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

Photos

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

+5

ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్‌పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)