Breaking News

హోంటూర్‌ చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు, రూ. 2.5 లక్షల జరిమానా..

Published on Tue, 02/21/2023 - 13:26

ప్రముఖ నటుడు రోబో శంకర్‌ హోంటూర్‌ చేసి చిక్కుల్లో పడ్డాడు. ఈ తమిళ నటుడు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. డబ్బింగ్‌ చిత్రాలతో ఆయన టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. తనదైన నటన, కామెడీ డైలాగ్స్‌తో తెలుగు ఆడియన్స్‌ని మెప్పించాడు. తమిళంలో మారి చిత్రంతో ఆయన పాపులర్‌ అయ్యాడు. ప్రస్తుతం తమిళంలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన ఆయన వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ తమిళ యూట్యూబ్‌ చానల్‌ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఇంటర్య్వూ చేసింది.

చదవండి: కస్తూరికి అస్వస్థత, ఆ వ్యాధి ప్రభావం చూపిస్తూ ఫొటోలు షేర్‌ చేసిన నటి

ఈ సందర్భంగా రోబో శంకర్‌ ఇంటిని హోంటూర్‌గా చేసి తమ యూట్యూబ్‌లో ఛానల్లో షేర్‌ చేసింది. దీంతో రోబో శంకర్‌ చిక్కుల్లో పడ్డాడు. ఈ హోంటూర్‌లో రోబో శంకర్‌ ఇంట అరుదైన చిలకలు కనిపించాయి. దీంతో ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖ అధికారులకు అతడిపై ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు రోబో శంకర్‌కు రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. కాగా ఆయన కొంతకాలంగా అలెగ్జాండ్రేన్‌ పారకీట్స్‌ అనే అరుదైన జాతి చిలుకలను పెంచుకుంటున్నాడు.

చదవండి: బీబీ జోడి జడ్జస్‌పై బిగ్‌బాస్‌ కౌశల్ సంచలన కామెంట్స్‌, పోస్ట్‌ వైరల్‌

హోంటూర్‌ వీడియోలో వాటిని చూసిన ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖకు ఫిర్యాదు చేయగా రోబో శంకర్‌ ఇంట వారు తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆ చిలుకలను అటవీ శాఖ స్వాధినం చేసుకుని అతడి రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. అయితే 1972 జంతు సంరక్షణ చట్టం ప్రకారం ఈ చిలుకలు పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతి కావాలని అధికారులు తెలిపారు. దీంతో అనుమతి లేకుండా వాటిని పెంచుతున్నందుకు రోబో శంకర్‌పై అటవీ అధికారులు ఆ‍గ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రోబో శంకర్‌ 1997లో వచ్చిన ధర్మచక్రం సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టాడు. రోబో సినిమాతో రోబో శంకర్‌ గుర్తింపు పొందాడు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)