నా గ్లామర్‌ రహస్యం ఇదే: తమన్నా

Published on Sun, 08/27/2023 - 06:44

తమిళసినిమా: అందం తిన్నానండి. అందుకే ఇలా ఉన్నాయండి అని ఒక పాటలో తన అందం గురించి తానే పొగుడుకున్న నటి తమన్నా భాటియా. అది నిజం కాకపోయినా ఈమె అందగత్తె అన్నది ముమ్మాటికీ నిజం అన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఇప్పటికే బిజీగా ఉన్న తమన్నా వయసు 33 ఏళ్లు.  నటిగా గత 18 ఏళ్లుగా తన అందాలను రకరకాల కోణాల్లో తెరపై ఆరబోస్తూనే ఉన్నారు. ఇటీవల నటించిన జైలర్‌ చిత్రంలో కూడా తాజా అందాలతో మెరిసిపోయి, ప్రేక్షకులను మైమరిపించారు.

అంతగా అభిమానులకు కిక్‌ ఇస్తున్న తన అందం రహస్యాన్ని తమన్నా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఈ గ్లామర్‌ ప్రపంచంలో ఫిట్నెస్‌గా ఉండడం చాలా అవసరం అన్నారు. అందుకు శారీరక కసరత్తులు ఎంత ముఖ్యమో, ఆహారపు అలవాట్లు అంతే ముఖ్యమని పేర్కొన్నారు. తాను ఆహారపు అలవాట్లకు ప్రాముఖ్యతనిస్తానన్నారు.

ఉదయం నట్స్, ఖర్జూరపండ్లు, అరటి పండ్లను సమానంగా తీసుకుని తింటానని చెప్పారు. మధ్యాహ్నం భోజనంలో బ్రౌన్‌ రైస్, పప్పు, కాయకూరలు తీసుకుంటానన్నారు. అదే విధంగా సాయంత్రం 5.30 డిన్నర్‌ ముగించేస్తానని, ఆ తరువాత మళ్లీ మరుసటి రోజు ఉదయం వరకు ఏమీ తిననని చెప్పారు. ఇలా 12 గంటలు తినకుండా ఉంటానన్నారు. దీంతో చర్మం కాంతులీనుతుందని చెప్పారు. ఇక గ్రీన్‌ టీ, ఆమ్లాజ్యూస్‌ వంటివి తన ఆరోగ్య రహస్యం ఒక భాగం అని మిల్కీ బ్యూటీ పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)