Breaking News

అభిమానికి ముద్దు పెట్టిన తమన్నా..వీడియో వైరల్‌

Published on Sat, 03/14/2026 - 11:53

సినీతారలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. కొంతమంది అయితే వాళ్లను పిచ్చిగా ప్రేమిస్తారు కూడా. వాళ్లను చూసేందుకే ఎంతో దూరం నుంచి వస్తారు. హాయ్‌ చెబితే చాలు.. ఆనందంతో పొంగిపోతారు. ఇక షేక్‌ హ్యాండ్‌ ఇస్తే.. దాన్ని పండగలా సెలబ్రేట్‌ చేసుకుంటారు. అలాంటిది స్టార్‌ హీరోయిన్‌ తమన్నా ఏకంగా ఓ అభిమానికి ముద్దు ఇచ్చింది. దీనికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

తమన్నా..ఒకప్పుడు టాలీవుడ్‌లో బిజియెస్ట్‌ హీరోయిన్‌. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌తో పాటు స్టార్‌ హీరోలందరితోనూ సినిమాలు చేసింది. ఒకనొక దశలో అత్యధిక పారితోషికంగా తీసుకున్న దక్షిణాది నటిగానూ పేరు సంపాదించుకుంది. కొన్నాళ్ల తర్వాత బాలీవుడ్‌కి తన మకాం మార్చింది. అయితే అక్కడ నటిగా కంటే..ఐటం సాంగ్స్‌ స్పెషలిస్ట్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. 

ఈ మధ్య ఆమె ఎక్కువగా స్పెషల్‌ సాంగ్సే చేస్తోంది. అవి సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు దాటిన తమన్నాకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమె ఓ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా వెళ్లింది. అక్కడ ఓ డ్యాన్స్‌ గ్రూప్‌.. స్త్రీ 2 మూవీలో తమన్నా చేసిన ఆజ్‌కి రాత్‌ పాటకి డ్యాన్స్‌ చేసింది. వారి డ్యాన్స్‌కి ఫిదా అయిన తమన్నా..వెంటనే స్టేజ్‌పైకి వెళ్లి వాళ్లతో కలిసి కాళ్లు కదిపింది. 

ఆ గ్యాంగ్‌లో తమన్నాను బాగా ఇష్టపడే ఓ యువతి కూడా ఉంది. అభిమాన నటి.. తనతో కలిసి స్టెప్పులేస్తుంటే..ఆనందంతో ఉబ్బితబ్బిపోయింది. ‘మేడం ప్లీజ్‌..ఒక కిస్‌ చేసుకోవచ్చా? అని ఆ యువతి అనగానే..తమన్నా ఓకే అన్నట్లుగా తల ఊపింది. ఇంకేముంది సదరు యువతి తమన్నా బుగ్గలపై ముద్దుపెట్టి గట్టిగా హగ్‌ చేసుకొని ఎమోషనల్‌ అయింది. అభిమాని ప్రేమకు ఫిదా అయిన తమన్నా..నవ్వుతూ.. ఆ యువతి బుగ్గపై ముద్దు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.  స్టార్‌ హీరోయిన్‌ అయినప్పటికీ ఓ సాధారణ అభిమానికి ప్రేమగా ముద్దు పెట్టడం పట్ల నెటిజన్స్‌ తమన్నాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)