'విజయ్‌' సినిమాను ఏకి పారేసిన తమన్నా

Published on Sun, 02/25/2024 - 07:00

చిత్రాల జయాపజయాలను ఎవరు ఊహించలేరు. తమ చిత్రాలు హిట్‌ అవ్వాలని అందరూ కోరుకుంటారు. అయితే ఫలితం మాత్రం ప్రేక్షకులు ఇచ్చే తీర్పు పైనే ఉంటుంది. మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలను వారు ఆదరిస్తూనే ఉంటారు. అదేవిధంగా ఒక్కోసారి మంచి కథ అనుకున్న చిత్రాలు కూడా ఆదరణకు దూరం అవుతుంటాయి. కర్ణుడి చావుకు కారణాలు పదివేలు అన్న చందంగా చిత్రాల జయాపజయాలకు కారణాలు చాలానే ఉంటాయి. అలానే నటుడు విజయ్‌ నటించిన సురా చిత్రం విడుదలై ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇది ఆయన నటించిన 50వ చిత్రం కావడం గమనార్హం.

ఇందులో నటి తమన్నా కథానాయకిగా నటించారు. అందులో విజయ్‌ సరసన నటించే అవకాశం రావడంతో చంకలు గుద్దుకున్న ఈ బ్యూటీ చిత్రం పరాజయం పొందడంతో చాలా రోజుల తర్వాత దానిపై విమర్శలు గుప్పించారు. అదొక చిత్రమా అంటూ హేళనగా మాట్లాడారు. ఆ చిత్రంలో నటించి తాను పెద్ద తప్పు చేశాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సురా చిత్రం వర్కౌట్‌ కాదన్న విషయాన్ని తాను ముందే గ్రహించానని చెప్పారు. అయినా అందులో నటించాల్సిన పరిస్థితి అని తమన్నా అన్నారు.

దక్షిణాదిలో టాప్‌ మోస్ట్‌ హీరోయిన్‌గా వెలిగిపోయిన తమన్నా ఇక్కడ విజయ్‌, అజిత్‌, సూర్య, ధనుష్‌, కార్తీ వంటి స్టార్‌ హీరోలతో జత కట్టారు. ఇక ఇటీవల సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి జైలర్‌ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ఆమె పాత్ర పరిధి తక్కువే అయినా నువ్వు కావాలయ్యా అన్న ఒక్కపాటతో ఆ చిత్రాన్ని కమ్మేశారు. అయినా ఆ తర్వాత తమన్నాకు ఇక్కడ అవకాశాలు దక్కకపోవడం గమనార్హం.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)