Breaking News

'తమన్నా' గ్లామరస్‌ సాంగ్‌ కోసం కోట్లలో ఛార్జ్‌

Published on Sun, 09/21/2025 - 18:58

తమన్నా భాటియా స్పెషల్‌ సాంగ్స్‌ అంటే గ్లామర్‌, ఎనర్జీ, స్టైల్‌ అన్నీ కలబోసి ఉంటుంది. ఇప్పటికే ఆమె చేసిన కొన్ని స్పెషల్‌ సాంగ్స్‌  థియేటర్లలో ప్రేక్షకులను ఊపేసేలా చేశాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా తెరకెక్కించిన 'ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్‌లో మిల్కీ బ్యూటీ వేసిన స్టెప్పులకు కుర్రకారు ఫిదా అవుతుంది.  ఇందులో ఆమె కాస్త గ్లామర్‌ డోస్‌ పెంచేశారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే,  ఈ సాంగ్‌ కోసం ఆమె భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ తీసుకున్నారని బాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తుంది.

ఇటీవల వచ్చిన ‘స్త్రీ 2’ సినిమాలో ‘ఆజ్‌ కీ రాత్‌’ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన తమన్నా (Tamannaah).. ఆ తర్వాత అదే జోష్‌తో ‘రైడ్‌ 2’లో మరో హిట్‌ సాంగ్‌తో అలరించింది. తాజాగా 'ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్‌ సిరీస్‌లో మరింత గ్లామర్‌గా కనిపించి స్టెప్పులేసింది. ఈ సాంగ్‌ కోసం ఆమె ఏకంగా రూ. 6 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.  ఒక స్పెషల్‌ సాంగ్‌ కోసం ఇంత మొత్తంలో రెమ్యునరేషన్‌ అందుకున్న నటిగా ఆమె రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

తమన్నా  ప్రస్తుతం ఒక సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుందని ఫిల్మ్‌ ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. రీసెంట్‌గా ఆమె నటించిన ఓదెల 2  సినిమాకు  భారీ రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు సమాచారం ఉంది. అలాగే, "రైడ్ 2" సినిమాలో "నషా" అనే ఐటమ్‌ సాంగ్‌ కోసం ఆమె రూ. 5 కోట్లు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. జైలర్ సినిమాలో తమన్నా  స్పెషల్ సాంగ్‌ కోసం ఆమెకు రూ. 3 కోట్లు రెమ్యునరేషన్‌ అందినట్లు కోలీవుడ్ వర్గాల్లో సమాచారం ఉంది. ఇప్పుడు వాటిని బ్రేక్‌ చేస్తూ కేవలం 3 నిమిషాల సాంగ్‌ కోసం ఏకంగా రూ. 6 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు బాలీవుడ్‌లో వైరల్‌ అవుతుంది.

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)