Breaking News

విజయ్‌ బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌ సినిమాపై తమన్నా కామెంట్‌

Published on Mon, 07/31/2023 - 13:30

సౌత్‌ ఇండియాలో ఫుల్‌ బిజీగా ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. సినిమాలతో పాటు పలు వెబ్‌ సీరిస్‌లతో ఆమె మెప్పిస్తుంది. ఆగష్టు నెలలోనే ఆమె నటించిన జైలర్‌,భోళా శంకర్‌ రిలీజ్‌ కానున్నాయి. తాజాగ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా దళపతి విజయ్‌ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. 

(ఇదీ చదవండి: సుమన్‌ జైలుకు వెళ్లడంపై బయటికొచ్చిన అసలు నిజాలు.. ఇంతమంది ప్రమేయం ఉందా?)

విజయ్‌- తమన్నా కలిసి 2010లో 'సుర' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాలోని పాటలు మాత్రం సూపర్‌ హిట్‌ అయ్యాయి. కానీ సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. అంతేకాకుండా ఈ సినిమా విజయ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌గా నిలిచింది. అలాంటి డిజాస్టార్‌పై తమన్నా తాజాగా ఇలా మాట్లాడింది. 'నాకు సుర సినిమా అంటే  చాలా ఇష్టం. అందులోని పాటలు ఇప్పటికీ చాలా చోట్ల వినిపిస్తూనే ఉన్నాయి. అందులో నటిస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలు నాకు నచ్చలేదు. కొన్ని సీన్స్‌లలో అయితే నా నటన నాకే నచ్చలేదు. ఆ సీన్లు సరిగా రావడంలేదనే  విషయాన్ని  షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే గ్రహించాను.

సీన్స్‌ బాగా రావడం లేదని సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే అంచనా వేయొచ్చు. కానీ అప్పుడు సినిమా నుంచి తప్పుకోవడం జరగదు. ఎందుకంటే ఒక సినిమాను అంగీకరించిన తర్వాత కచ్చితంగా దాన్ని పూర్తిచేయాల్సిందే. ఏవో కొన్ని కారణాలు చెప్పి తప్పించుకోకూడదు. ఈ  రంగంలో జయాపజయాలు సహజం. నటులందరికి ఇండస్ట్రీ చాలా విలువైనది. కాబట్టి ప్రతివారు బాధ్యతాయుతంగా ఉండాలి.' అని తమన్నా చెప్పింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)