Breaking News

నేను ఏదీ అర్థం చేసుకోలేకున్నా: తమన్నా

Published on Sat, 02/07/2026 - 07:05

అందం ఏ ఒక్కరికీ సొంతం కాదు. అయినా ఎవరి అందం వారికి ముద్దే. అదేవిధంగా అందం అనేది చూసేవారి దృష్టిని బట్టి ఉంటుందంటారు. అలాంటి అందాల్లో తమన్నా అందమే వేరయా అని పేర్కొనవచ్చు. ఈమె ఒక్కో చిత్రంలో ఒక్కో విధంగా తన అందాలను మార్చుకుంటారు. అలా ఏ కోణంలో చూసిన తమన్నా అందంగానే కనిపిస్తారు. అలా తన అందచందాలతో, హావభావాలతో రెండు దశాబ్దాలకు పైగా భారతీయ సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. 

కాగా ఈ 36 ఏళ్ల భామ ఇప్పటికీ కథానాయకిగా నాటౌట్‌గా నిలబడడం  మరో విశేషం. అదేవిధంగా ఐటం సాంగ్స్‌లోనూ యువతను గిలిగింతలు పెట్టడంలో ఈ బ్యూటీది ప్రత్యేక శైలి అనే చెప్పాలి. అలా ఒక్క ఐటమ్‌ సాంగ్‌కు రూ.6 కోట్లు డిమాండ్‌ చేస్తున్న నటి తమన్నా. కాగా చిన్న గ్యాప్‌ తర్వాత ఈ అమ్మడు తాజాగా కోలీవుడ్లో విశాల్‌కు జంటగా సుందర్‌.సి దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఆ మధ్య ప్రేమ వ్యవహారంలో చిక్కుకొని వార్తల్లో నిలిచారు. విజయ్‌వర్మ అనే బాలీవుడ్‌ నటుడితో కొద్దిరోజులు చట్టాపట్టాలేసుకొని తిరిగారు. అదీ మూడునాళ్ల ముచ్చటే అయ్యింది. కొంతకాలానికే వీరి మధ్య బ్రేకప్‌ అయ్యింది. 

ఇటీవల ఇకపై ఐటెం సాంగ్స్‌లో నటించనని పేర్కొన్న తమన్నా మళ్లీ ఇప్పుడు ప్రముఖ హీరోల చిత్రాల్లో అలాంటి పాటల్లో నటించడానికి సిద్ధమే అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తమన్నా లైఫ్‌లో తను తీసుకున్న నిర్ణయాలనే పలుమార్లు మార్చుకుంటూ వెళ్తుందా అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇలాంటి ప్రశ్నే ఇటీవల ఒక కార్యక్రమంలో ఎదురైన ప్రశ్నకు తమన్నా ఆసక్తికరమైన బదులు చెప్పారు. తనను తానే అర్థం చేసుకోలేకపోతున్నానని, ఇతరులు ఎలా అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు. 
  

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)