'నువ్వే కావాలి' అంటున్న తమన్నా ఫ్యాన్స్‌

Published on Sun, 07/13/2025 - 08:38

ఐటెం సాంగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన బ్యూటీ తమన్నా అని చెప్పవచ్చు. చాలామంది అగ్ర కథానాయికలు ఐటమ్‌ సాంగ్స్‌లో నటిస్తున్నా, తమన్నా నటిస్తున్న ఐటమ్‌ సాంగ్స్‌లో ఉండే మజానే వేరు. అది తెలుగు, తమిళం, హిందీ ఏ భాషలో అయినా కావచ్చు ఆమె చేసే డాన్స్‌లో ఉండే కిక్కే వేరు. ఇటీవల హిందీ చిత్రం 'స్త్రీ2'లో తమన్నా నటించిన ప్రత్యేక పాట ఆ చిత్రానికే హైలెట్‌ అయింది. కాగా ఆ మధ్య తమిళంలో రజనీకాంత్‌ కథానాయకుడుగా నటించిన జైలర్‌ చిత్రంలో 'వా నువ్వు కావాలయ్యా' అనే ప్రత్యేక పాటలో తమన్నా డాన్స్‌ తీసుకొచ్చిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఏకంగా ఈ సాంగ్‌ ఆడియో, వీడియో కలిపి 500 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది. 

తాజాగా జైలర్‌–2 చిత్రం కోసం నువ్వు కావాలయ్యా 2.ఓ పాట లోడింగ్‌ అవుతున్నట్లు తెలిసింది. కూలీ చిత్రాన్ని పూర్తి చేసిన రజనీకాంత్‌.. ప్రస్తుతం తన కెరీర్‌కు బూస్ట్‌ ఇచ్చిన జైలర్‌ చిత్రానికి సీక్వెల్‌ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం జైలర్‌–2 చిత్ర షూటింగ్‌ కేరళలో జరుగుతోంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌, బాలకృష్ణ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుద్‌ సంగీతాన్ని, విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌ చాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా తమన్నా జైలర్‌–2 చిత్రంలోని క్యామియో పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. దీంతో నువ్వు కావాలయ్యా 2.ఓ లోడింగ్‌ అవుతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)