ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై
Breaking News
ఓటీటీలో ఇన్వెస్టిగేటివ్ కోర్ట్‌రూమ్ డ్రామా సినిమా
Published on Tue, 04/14/2026 - 08:58
నటి తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా 'అస్సీ' (Assi). హిందీ వర్షన్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 20న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇంటెన్సివ్ కోర్ట్‌రూమ్ డ్రామాను థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించింది. మహిళలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కఠినమైన సామాజిక కథాంశంతో అస్పీని తెరకెక్కించారు. ఇందులో తాప్సీ ధైర్యంతో కూడిన న్యాయవాదిగా నటించింది. మలయాళ నటి కని కుస్రుతి అత్యాచార బాధితురాలిగా కన్నీళ్లు తెప్పించే పాత్రలో కనిపించింది.

'అస్సీ' (Assi) చిత్రం 2026 ఏప్రిల్ 17 నుండి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, కేవలం హిందీ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రం పితృస్వామ్యం, సామాజిక ఉదాసీనత, బాధితులను నిందించడం, లైంగిక దాడి వల్ల కలిగే దీర్ఘకాలిక మానసిక క్షోభ వంటి ఇతివృత్తాలను అన్వేషిస్తుంది. ఈ చిత్ర కథను గౌరవ్ సోలంకి, అనుభవ్ సిన్హా రచించి నిర్మించారు.
Tags : 1