Breaking News

ఏపీలో చిరంజీవి కూమార్తె సుస్మితకు పదవి

Published on Tue, 09/08/2026 - 14:10

మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కూతురు, ఫ్యాషన్ డిజైనర్, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ద‌వి ద‌క్కింది. విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఆమె నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌  దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు అధికారికంగా మంగ‌ళ‌వారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై సూచనలు చేయడం, ప్రత్యేక ఉత్సవాల నిర్వహణలో భాగస్వామ్యం కావడం వంటి అంశాల్లో సుస్మిత కొణిదెల తన సేవలను అందించనున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే మెగా కుటుంబానికి ఓ పదవిని ఇచ్చింది. తెలంగాణ‌లోని యాద‌గిరిగుట్ట ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి స‌భ్యురాలిగా చిరంజీవి సతీమణి సురేఖను నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.

ఇక సుస్మిత విషయానికొస్తే.. ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం సినీ నిర్మాతగా రాణిస్తున్నారు.  గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. వరుస సినిమాలు నిర్మిస్తున్నారు.  త‌న తండ్రి చిరంజీవిని హీరోగా పెట్టి ఆమె  నిర్మించిన చిత్రం ‘మ‌న శంక‌ర వ‌ర ప్రసాద్ గారు’ ఈ సంక్రాంతికి విడుదలై విజ‌యాన్ని అందుకుంది.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)