పరాక్రమవంతుడు

Published on Mon, 04/17/2023 - 04:20

సూర్య, దిశా పటానీ జంటగా, యోగిబాబు కీలక పాత్రలో శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌లతో కలిసి జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘కంగువ’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాని రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ టీజర్‌ను విడుదల చేశారు. డైరెక్టర్‌ శివ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో సూర్య గంభీరంగా కనిపిస్తారు. ‘కంగువ’ మాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం.

షూటింగ్‌ను పూర్తి చేసి, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘త్రీడీలో పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యేలా కామన్‌ టైటిల్‌ పెట్టాల్సి వచ్చింది. అందుకే అన్ని భాషల్లో ‘కంగువ’ టైటిల్‌ను ఫిక్స్‌ చేశాం. కంగువ అంటే అగ్నిశక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు అనే అర్థాలు వస్తాయి. ఈ సినిమా షూటింగ్‌ 50 శాతం పూర్తయ్యింది. మరో నెలలో బ్యాలన్స్ షూటింగ్‌ పూర్తి చేస్తాం. గ్రాఫిక్స్‌ వర్క్‌ ఎక్కువగా చేయాల్సి ఉంది.. దీంతో పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌కు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే 2024 ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం’’అని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)