మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
Indira Devi Death: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం
Published on Wed, 09/28/2022 - 07:26
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఘట్టమనేని ఇందిరా దేవి(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇందిరా దేవికి రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఐదుగురు సంతానం.
అభిమానుల సందర్శనార్థం ఇందిరా దేవీ భౌతిక కాయాన్ని పద్మాలయ స్టూడియోస్‌కి తరలిస్తారు. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఈ ఏడాది జనవరిలోనే రమేశ్ బాబు(56) మృతిచెందారు. ఏడాది తిరగకముందే ఇందిరా దేవి కూడా కన్నుమూయడం కృష్ణ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. కాగా.. ఇందిరా దేవి మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. తీవ్ర దుఃఖంలో ఉన్న కృష్ణ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Tags : 1