భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..
Breaking News
గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ పార్థివదేహం.. ఎందుకు తరలించలేదంటే?
Published on Tue, 11/15/2022 - 18:59
సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని ఇవాళ నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసంలోనే ఉంచనున్నారు. అభిమానుల సందర్శనార్థం విజయకృష్ణ నిలయం వద్దే ఈ రాత్రికి పార్థివదేహాన్ని ఉంచునున్నట్లు ప్రకటించారు. సూపర్ స్టార్ అభిమానులు ఆయన నివాసం వద్దకే వచ్చి నివాళులు అర్పించవచ్చని మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చేసింది. అయితే రేపు ఉదయం 9 గంటలకు పద్మాలయ స్టూడియోస్‌కు ఆయన పార్థివదేహాన్ని తరలించనున్నారు.
(చదవండి: సూపర్ స్టార్ కృష్ణ మరణం.. రాజమౌళి ఎమోషనల్ ట్వీట్)
మంగళవారం సూర్యాస్తమయం కావడం వలన పార్థివదేహాన్ని ఆయన నివాసం వద్దే ఉంచుతున్నారు. మొదట సాయంత్ర 5 గంటల తర్వాత గచ్చిబౌలి స్టేడియానికి తరలించాలని భావించారు. కానీ సమయం మించి పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు.
మంగళవారం సూర్యాస్తమయం కావడం వలన అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివ దేహాన్ని నానక్‌రామ్‌గూడలోని విజయకృష్ణ నిలయం వద్దే ఉంచుతున్నారు. అభిమానులు ఇక్కడికే వచ్చి నివాళులు అర్పించవచ్చు.
— GMB Entertainment (@GMBents) November 15, 2022
Tags : 1