Breaking News

సూపర్‌ స్టార్ ఫ్యాన్స్‌కు షాక్.. సంక్రాంతి రేసు నుంచి అవుట్!

Published on Tue, 01/09/2024 - 17:54

గతేడాది జైలర్ మూవీతో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన తలైవా రజినీకాంత్. కొత్త ఏడాదిలోనూ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు తలైవా రెడీ అయిపోయారు. తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ స్పోర్ట్స్ డ్రామా లాల్ సలామ్ చిత్రంతో సంక్రాంతి బరిలో నిలిచారు. సంక్రాంతికి స్టార్ హీరోల చిత్రాలు క్యూ కట్టడం సర్వసాధారణం. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో అదే రేంజ్‌లో పోటీ ఉంటుంది. అయితే పొంగల్‌ బరి నుంచి రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ తప్పుకుంటున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని ఐశ్వర్య రజినీకాంత్ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. కొత్త రిలీజ్‌ తేదీని ఆమె ప్రకటించింది. 

కాగా.. ఈ చిత్రంలో రజినీకాంత్‌తో పాటు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రజీనీకాంత్.. మొయిద్దీన్ భాయ్‍ క్యారెక్టర్ చేశారు. ముంబై బ్యాక్‍డ్రాప్‍లో క్రికెట్, రాజకీయాల చుట్టూ తిరిగే కథాంశంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.  టీమిండియా దిగ్గజం కపిల్‌దేవ్‌ కూడా ఇందులో గెస్ట్ రోల్ చేశారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు ఐశ్వర్య వెల్లడించారు. కాగా.. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు.

కాగా.. కొన్నేళ్లపాటు విరామం తీసుకున్న తర్వాత రజినీకాంత్ కూతురు ఐశ్వర్య లాల్ సలామ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో విఘ్నేశ్, లివింగ్‍స్టన్, సెంథిల్, జీవిత, కేఎస్ రవికుమార్, తంబి రామయ్య, నిరోష. వివేక్ ప్రసన్న, ధన్య బాలకృష్ణన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)