Breaking News

సునీల్‌ మలయాళ మూవీ 'కాటాలన్‌’ గ్రాండ్‌ లాంచ్..

Published on Mon, 08/25/2025 - 10:36

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ మార్కో పాన్ ఇండియా  హిట్ అయ్యింది. ఇప్పుడదే బ్యానర్‌పై ప్రొడ్యూసర్ షరీఫ్ మహమ్మద్ మరో భారీ ప్రాజెక్ట్ కాటాలన్‌ను లాంచ్ చేశారు. మలయాళం, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ మూవీ పూజా కార్యక్రమం కొచ్చిలో జరిగింది. బాహుబలిలో కనిపించి ఫేమస్ అయిన చిరక్కల్ కలీదాసన్ ఏనుగు పూజా కార్యక్రమంలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

లగ్జరీ కార్లు, బైక్‌లు కూడా ఈవెంట్‌ను మరింత స్పెషల్ చేశాయి. సినిమాలోని కథ లైన్‌ను దృష్టిలో పెట్టుకుని పూజా ప్రెజెంటేషన్ కూడా డిజైన్ చేశారు. హీరోయిన్‌గా రాజిషా విజయన్ నటించనున్నారు. తెలుగు నటుడు సునీల్, ‘మార్కో’ ఫేమ్‌ కబీర్ దూహన్ సింగ్, వ్లాగర్-సింగర్ హనన్ షా, ర్యాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాసు, జగదీష్, సిద్దిక్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

సుమారు ₹45 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఇప్పటికే వైరల్ అయ్యింది.  డెబ్యూ డైరెక్టర్ పాల్ జార్జ్ దర్శకత్వం వహిస్తుండగా, కాంతార ఫేమ్‌ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ 1, బాహుబలి 2, జవాన్, బాఘీ 2 వంటి  సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేసిన వరల్డ్ ఫేమస్ ఫైట్ మాస్టర్ కేచా ఖాంఫక్డీ ఈ సినిమాలో కూడా స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు.

 

 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)