Breaking News

రెండున్నరేళ్లు బాధ్యతతో పని చేశాం: సందీప్‌ కిషన్‌

Published on Fri, 01/19/2024 - 10:11

‘‘ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్‌ అనుభూతి ఇవ్వాలని దాదాపు రెండున్నరేళ్లు ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా కోసం ఒక బాధ్యతతో పని చేశాం. ఈ చిత్రం పెద్ద విజయం సాధించడం మా యూనిట్‌కి చాలా అవసరం. ఆ బాధ్యతని, అవసరాన్ని గుర్తు చేసుకుంటూ పని చేశాం’’ అని సందీప్‌ కిషన్‌ అన్నారు. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది.

(చదవండి: రవితేజ సినిమాతో క్లాష్‌.. వెనక్కి తగ్గలేమని చెప్పిన సందీప్‌ కిషన్‌)

హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకలో ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ– ‘‘ఊరు పేరు భైరవకోన’ కమర్షియల్లీ ఫుల్‌ ప్యాకేజ్డ్‌ ఎంటర్‌టైనర్‌’’ అన్నారు. ‘‘ఈ సినిమా నా కెరీర్‌లో ఓ సవాల్‌. ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు వీఐ ఆనంద్‌. ‘‘ఈ మూవీలో ప్రేమకథ, కామెడీ, ఫ్యాంటసీ, యాక్షన్‌.. ఇలా అన్ని అంశాలున్నాయి. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు రాజేశ్‌ దండా. ‘‘గొప్ప థియేట్రికల్‌ అనుభూతినిచ్చే మూవీ ఇది. థియేటర్స్‌లోనే ఈ సినిమా చూడండి’’ అన్నారు వర్ష, కావ్య. ఈ చిత్రానికి సహనిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: శేఖర్‌ చంద్ర, కెమెరా: రాజ్‌ తోట.

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)