Breaking News

'కూలీ' సెన్సార్‌ విషయంలో కోర్టుకు సన్‌ పిక్చర్స్‌

Published on Wed, 08/20/2025 - 08:08

రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కూలీ’. ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైంది. కేవలం నాలుగు రోజుల్లోనే బాక్సాఫీస్‌ వద్ద రూ. 404 కోట్ల గ్రాస్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అయితే, ఈ సినిమాకు సెన్సార్‌ నుంచి ‘ఏ’ సర్టిఫికెట్‌ వచ్చింది. దీంతో కలెక్షన్స్‌పై కాస్త ప్రభావం చూపుతుంది. ఈ అంశాన్ని గుర్తించిన నిర్మాణ సంస్థ  సన్ పిక్చర్స్ తాజాగా మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది.

భారత్‌లో 'కూలీ' సినిమాకి CBFC నుండి A సర్టిఫికేట్ పొందింది. అయితే, విదేశీ సెన్సార్‌ మాత్రం  భిన్నమైన రిపోర్ట్‌ను జారీ చేసింది. ఒక్క కట్‌ కూడా సూచించకుండా ‘యూ/ఏ’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సుమారు మూడు దశాబ్దాల తర్వాత రజనీ సినిమాకి A సర్టిఫికేట్ లభించిడంతో అందరూ ఆశ్చర్యపోయారు.  ఇది మొత్తం కలెక్షన్లపై నిజంగానే ప్రభావం చూపింది. దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌లు పిల్లలను పరిమితం చేశాయి. అయితే, సినిమాలో ఊహించినంతగా  హింస లేకపోవడంతో సెన్సార్‌ వివషయంలో ప్రేక్షకులు తప్పుబట్టారు. ఈ సినిమాకి A సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందని చాలామంది ఆశ్చర్యపోయారు.

సెన్సార్‌ ఇచ్చిన ఈ సర్టిఫికేషన్‌ను సవాలు చేస్తూ సన్ పిక్చర్స్ ఇప్పుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. సెన్సార్ బోర్డు కూలీ సర్టిఫికేషన్‌ను ‘U/A’గా ఇచ్చేలా ఆదేశించాలని  కోర్టును అభ్యర్థించినట్లు సమాచారం. ఈ విషయంలో మేకర్స్ చాలా ఆలస్యంగా వ్యవహరించడంతో, ఇప్పటికే తగినంత నష్టం జరిగిపోయింది. మద్రాస్ హైకోర్టు మేకర్స్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తుందా..? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో నాగార్జున, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్‌, సత్యరాజ్, సౌబిన్‌షాహిర్, మహేంద్రన్‌ తదితరులు నటించారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)