అప్పుడే మంచి సినిమాలు వస్తాయి: సుమన్‌

Published on Tue, 01/28/2025 - 14:20

చిత్ర పరిశ్రమలో కొత్తవాళ్లను ఎంకరేజ్‌ చేయాలి. నూతన దర్శకులను, చిన్న చిత్రాలను ప్రొత్సహిస్తేనే  మంచి సినిమాలు వస్తాయి’ అన్నారు సీనియర్‌ హీరో సుమన్‌. శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్, ఫోర్ ఫౌండర్స్ పతాకాలపై బన్నీ అశ్వంత్ దర్శకత్వంలో సామా శ్రీధర్, పంజాల వెంకట్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రాజా మార్కండేయ". "వేట మొదలైంది" అనేది ఉప శీర్షిక.

చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జనవరి 27న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిధుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ హీరో సుమన్, ప్రతాని రామకృష్ణ గౌడ్, హీరో తేజస్ వీరమాచినేని, హీరోయిన్స్ రోమి, దేవిక, ప్రత్యూష, దర్శకుడు బన్నీ ఆశ్వంత్, నిర్మాతలు సామా శ్రీధర్, పంజల వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చిత్రంలోని ఒక్కో పాటను విచ్చేసిన అతిధులు ఆవిష్కరించగా.. టీజర్ ను రాపోలు భాస్కర్  విడుదల చేశారు. సినిమా ట్రైలర్ ను హీరో సుమన్ రిలీజ్ చేశారు.

అనంతరం హీరో సుమన్ మాట్లాడుతూ.. "రాజా మార్కండేయ" సినిమా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. టీజర్, ట్రైలర్ చూస్తుంటే మంచి కంటెంట్ ను నమ్ముకొని తీసినట్టు ఉంది. అందరూ కొత్తవాళ్ళైనా సినిమాలో మంచి కథ ఉందని అర్థం అవుతుంది. ఇలాంటి కొత్తవాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అప్పుడే మంచి సినిమాలు వస్తాయి. చిత్రంలో శివయ్య పాట చాలా అద్భుతంగా ఉంది. రాబోయే శివరాత్రి పండుగకు ప్రతి దేవాలయంలో ఈ పాట మార్మోగుతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించి నిర్మాత దర్శకులకు మంచి లాభాలు రావాలి" అన్నారు.


సంగీత దర్శకులు యస్ కె. మీరావలి, రాయారావు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. "బన్నీ ఆధ్వర్యంలో ఫోర్ ఫౌండర్స్ టీం మమ్ములను తీసుకొచ్చి ఈ చిత్రానికి మ్యూజిక్ చేయించారు. వారివల్లే మేము ఇండస్ట్రీకి రాగలిగాము. ఆడియోతోపాటు సినిమాని కూడా పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాము అన్నారు.

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. "చిత్ర దర్శకుడు బన్నీ మా సభ్యుడే. చాలా టాలెంట్ వున్న వ్యక్తి. నిర్మాతలు మా జిల్లాకు చెందినవారు. అందరూ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. సాంగ్స్ ట్రైలర్ అధ్బుతంగా వున్నాయి. డెఫినెట్ గా ఈ సినిమా హిట్ అవుతుంది" అన్నారు.

దర్శకుడు బన్నీ ఆశ్వంత్ మాట్లాడుతూ.. "ఇరవై సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వున్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను. సినిమా తీయాలని నా కల. నాకు సహకరించి ప్రోత్సహించిన మా నిర్మాతలకు, స్నేహితులకి ధన్యవాదాలు. ఈనాటి కలియుగంలో శివుడి భక్తుడైన మార్కండేయ జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? వాటిని శివుడి అనుగ్రహంతో ఎలా అధిగమించాడు? అనేది కాన్సెప్ట్. మీరావలి మంచి సంగీతాన్ని అందించారు. ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా కోపరేట్ చేసి వర్క్ చేశారు.. లైఫ్ లాంగ్ కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ సినిమాలు తీయాలన్నదే నా ధ్యేయం. మా సినిమా ప్రేక్షలందరికి నచ్చుతుంది" అన్నారు. ‘సినిమా బాగా వచ్చింది. ఆడియెన్స్ కి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది’ అని నిర్మాత సామా శ్రీధర్‌ అ‍న్నారు. 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)