Breaking News

జైలు నుంచే హీరోయిన్‌కి ప్రేమ లేఖ..గిఫ్ట్‌గా ప్రైవేట్‌ జెట్‌!

Published on Sat, 02/15/2025 - 08:33

‘బేబీ.. హ్యాపీ వాలంటైన్స్‌ డే. ఈ ఏడాది మనకు ఎంతో సానుకూలంగా ప్రారంభమైంది. జీవితాంతం ప్రేమికుల రోజును మనం సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. జాకీ.. నిజంగానే నాకు నువ్వంటే ఎంతో ఇష్టం. ఈ ప్రపంచంలోనే అద్భుతమైన ప్రియురాలివి. పిచ్చివాడిలా నిన్ను ప్రేమిస్తున్నా’ అంటూ హీరోయిన్‌ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌( Jacqueline Fernandez )కు ప్రేమ లేఖ రాశాడు ఆర్థిక నేరగాడు సుఖేశ్‌ చంద్ర శేఖర్‌(Sukesh Chandrashekhar). మరో జన్మంటూ ఉంటే జాక్వెలిన్‌ హృదయంగా జన్మిస్తానంటూ లేఖలో పేర్కొన్నాడు.  

అంతేకాదు జైలులో ఉన్నప్పటికీ తన ప్రియురాలికి ప్రైవేట్‌ జెట్‌ను కానుకగా ఇచ్చాడు. ‘షూటింగ్స్‌ కోసం వివిధ దేశాలకు ప్రయాణిస్తుంటావు. అందుకే నీకోసం ఓ ప్రైవేట్‌ జెట్‌ని బహుమతిగా అందిస్తున్నాను.  నీ పేరులోని తొలి అక్షరాలు ఆ జెట్‌పై రాసి ఉంటాయి. అదే విధంగా నీ పుట్టిన రోజు తేదీతో రిజిస్ట్రేషన్‌ నంబర్‌ తీసుకున్నా. ఈ జెట్‌లో ఇకపై నీ ప్రయాణాలు సౌకర్యంగా జరుగుతాయి’ అని ప్రియురాలిపై తనకున్న ప్రేమనంతా లేఖ రూపంలో రాశాడు.

రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్‌ సింగ్‌, శివిందర్‌ సింగ్‌కు బెయిల్‌ ఇప్పిస్తామని నమ్మించి వారి భార్యల నుంచి రూ. 200 కోట్లు వసూల్‌ చేశాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌. ఆ తర్వాత బెయిల్‌ విషయాన్ని దాటవేశాడు. దీంతో శివిందర్‌ సింగ్‌ భార్య అదితి సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2021లో ఢిల్లీ పోలీసులు సుఖేశ్‌ అరెస్ట్‌ చేశారు. అతనితో జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. అతని నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్లు గుర్తించారు. 

జాక్వెలిన్‌ తన ప్రియురాలు అని సుఖేశ్‌ అంటుంటే.. అసలు అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని జాక్వెలిన్‌ చెబుతోంది. కోర్టులో కూడా ఇదే విషయం చెప్పింది. అయిన్పటికే సుఖేశ్‌ మాత్రం ప్రేమ లేఖలు రాస్తూనే ఉన్నాడు. బహుమతులు పంపిస్తూనే ఉన్నాడు. ఆమె బర్త్‌డేకి ఓ పెద్ద పడవను గిఫ్ట్‌గా అందించాడు. క్రిస్మస్‌ కానుకగా పారిస్‌లో ఒక వైన్‌ యార్డ్‌నే కానుకగా ఇస్తున్నట్లు లేఖ రాశాడు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)