Breaking News

షూటింగ్‌ పూర్తి కాగానే అక్కడ జరిగేది ఇదే.. లైంగిక వేధింపులపై సుహాసిని

Published on Thu, 11/28/2024 - 12:35

మలయాళ చిత్ర పరిశ్రమలో  కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక స్పష్టం చేసిన తర్వాత చాలామంది సీనియర్‌ హీరోయిన్లు నిజమేనంటూ తమ అభిప్రాయం చెప్పారు. అయితే,  తాజాగా  నటి సుహాసిని ఆ విషయాన్ని మరోసారి ధ్రువీకరించారు. ప్రస్తుతం గోవాలో అంతర్జాతీయ చిత్రోత్సవాల వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సినిమాలో మహిళలకు రక్షణ అనే అంశంపై చర్చావేదికను నిర్వహించారు. అందులో పలు భాషలకు చెందిన నటీమణులు, దర్శకులు పాల్గొన్నారు. 

అందులో పాల్గొన్న నటి సుహాసిని మాట్లాడుతూ సినిమా రంగం ఇతర రంగాలకు కాస్త భిన్నమైందని పేర్కొన్నారు. ఇతర రంగాలలో పని చేసే వారు పని పూర్తి కాగానే ఇంటికి వెళ్లిపోతారన్నారు. అయితే సినిమాలో అలా కాదన్నారు. 200 నుంచి 300 మంది షూటింగ్‌ కోసం ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడే ఒక కుటుంబంలా కలిసుండాలన్నారు. అక్కడ విధి, విధానాలను పాటించకపోతే హద్దులు మీరే అవకాశం ఉంటుందన్నారు. 200 మంది ఓ చిత్ర యూనిట్‌లో తమ కుటుంబాలకు దూరంగా ఉండే వారిపై కొందరు అడ్వాంటేజ్‌ తీసుకుంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

అంతేకాకుండా ఇప్పుడు సినిమా రంగంలోని వస్తున్న వారికి సరైన అనుభవం ఉండటం లేదన్నారు. దీన్ని కొందరు తప్పుగా వాడుకోవాలను చూస్తారన్నారు. అదేవిధంగా ఇతర చిత్ర పరిశ్రమల మాదిరి మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలకు రక్షణ తక్కువన్నారు. మలమాళ చిత్రాల షూటింగ్‌లు అధికంగా వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతుంటాయని చెప్పారు. దీంతో నటీమణులు నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుందన్నారు. దీంతో వారిపై తప్పుగా ప్రవర్తించే అవకాశం ఎక్కువన్నారు. ఇదే మలయాళ చిత్ర పరిశ్రమలో జరుగుతోందని చెప్పారు. 

తమిళ చిత్ర షూటింగ్‌ పూర్తి అయితే తాను చైన్నెకి తిరిగి వెళ్లిపోతానని, తెలుగు షూటింగ్‌ అయితే హైదరాబాద్‌కు, కర్ణాటకలో షూటింగ్‌ అయితే బెంగళూర్‌కు వెళ్లిపోతానన్నారు. అయితే మలయాళం సినిమాల షూటింగ్‌ పూర్తి అయితే మీరు ఇంటికి తిరిగి వెళ్లలేరని, కారణం అక్కడ అలాంటి వాతావరణం లేకపోవడమేనని అన్నారు. అంతేకాకుడా మీకు బయటకు కూడా వెళ్లడం కుదరదన్నారు. అందుకే షూటింగ్‌ ప్రాంతాల్లో హద్దులు మీరుతున్నాయనే అభిప్రాయాన్ని నటి సుహాసిని వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.
 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)