Breaking News

వర్షాల ఎఫెక్ట్.. వాయిదా పడిన సుహాస్ సినిమా

Published on Wed, 09/04/2024 - 12:46

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. అవసరముంటే తప్పితే జనాలు పెద్దగా బయటకు రావట్లేదు. ఈ వర్షం వల్ల గతవారం థియేటర్లలో రిలీజైన 'సరిపోదా శనివారం' సినిమాకు పెద్ద దెబ్బ పడింది. బాగుందనే టాక్ వచ్చినప్పటికీ వర్షం వల్ల కలెక్షన్స్ పడిపోయాయి. 5 రోజుల్లో రూ.65 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది.

(ఇదీ చదవండి: ప్రభాస్ భారీ విరాళం.. మీరు విన్నది నిజం కాదు!)

ఇలా వర్షాల వల్ల ప్రజలు ఇ‍బ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలతో పాటు తెలుగు స్టార్ హీరోలు చాలామంది లక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే సుహాస్ హీరోగా దిల్ రాజు నిర్మాణ సంస్థ తీసిన 'జనక అయితే గనక' సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

లెక్క ప్రకారం సెప్టెంబరు 7న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాలి. ముందు రోజు ప్రీమియర్లు కూడా ప్లాన్ చేశారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఇంతలోనే మరోసారి తెలుగు రాష్ట్రాలకు వర్షం పోటెత్తనుందనే హెచ్చరిక వచ్చింది. 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడబోతున్నాయని అంటున్నారు. దీనిబట్టి చూస్తే వాయిదా వేసి మంచి పనే చేశారనిపిస్తోంది.

(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్!)

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)