Breaking News

సుడిగాలి సుధీర్‌ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? ఫోటోలు వైరల్‌!

Published on Sun, 10/18/2026 - 10:34

బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన సుధీర్ ..తనదైన మ్యానరిజంతో బుల్లితెరపై స్టార్‌గా ఎదిగాడు.కేవలం కమెడియన్‌గానే కాకుండా యాంకర్‌గా, హోస్ట్‌గానూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. బుల్లితెరపై వచ్చిన ఫేమ్‌తో హీరోగా మారాడు. సినిమాల్లోనూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 

అయితే, సుధీర్‌ ఏ షో చేసిన ఆయన పెళ్లి, ప్రేమ గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. జబర్దస్త్‌ షో చేసినప్పుడు..యాంకర్‌ రష్మితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు స్కిట్లు చేయడం..పంచులు వేయడంతో నిజంగానే సుధీర్‌, రష్మి రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఇదంతా షో టీఆర్పీ పెంచడం కోసం చేసిన స్టంట్స్‌ మాత్రమే. వినోదం పంచడం కోసమే అలా నటించామని అటు సుధీర్‌, ఇటు రష్మి చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ సుధీర్‌ పెళ్లి గురించి సోషల్‌ మీడియాలో వార్తలు పుట్టుకొస్తునే ఉన్నాయి.

(చదవండి: ‘ఇట్స్‌ థ్రిల్లింగ్‌ టైమ్‌’ అంటున్న బాలీవుడ్‌ స్టార్స్‌!)

తాజాగా సుధీర్‌కి 2014లోనే పెళ్లి అయిందనే వార్తలు బయటకు వచ్చాయి. దానికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అయితే అసలు విషయం ఏంటే.. సుధీర్‌కి 2014లో ఓ అమ్మాయితో నిజంగానే పెళ్లి ఫిక్స్‌ అయింది. ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సంబంధం పెళ్లి పీటల దాకా వెళ్లకుండానే మధ్యలోనే రద్దయిపోయింది. 

ఇద్దరు ఇష్టపూర్వకంగానే పెళ్లిని రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్న ఫోటోలు ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించినవి. జబర్దస్త్‌ నటుడు రాకేజ్‌... నిశ్చితార్థం వేడుకకి వెళ్లి..ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇప్పుడు ఆ ఫోటోలను బయటకు తీసి..నెట్టింట వైరల్‌ చేస్తున్నారు. ఇక సుధీర్ సినిమాల విషయానికొస్తే.. ఆయన నటించిన గోట్ రిలీజ్ కి సిద్ధమవుతుండగా.. హైలెస్సో సెట్స్ మీద ఉంది.
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)