Breaking News

అందుకే ఈ సినిమా నిర్మించా!

Published on Thu, 06/29/2023 - 03:44

‘‘నారాయణ అండ్‌ కో’ కథని డైరెక్టర్‌ చిన్నా చెప్పినప్పుడు గమ్మత్తుగా అనిపించింది. ఫ్యామిలీ అండ్‌ క్రైమ్‌ కామెడీగా రూపొందిన ఈ చిత్రం కుటుంబమంతా కలిసి హాయిగా నవ్వుకునేలా
ఉంటుంది’’ అని సుధాకర్‌ కోమాకుల అన్నారు. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘నారాయణ అండ్‌ కో’. పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్‌ కోమాకుల నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలకానుంది.

ఈ సందర్భంగా సుధాకర్‌ కోమాకుల మాట్లాడుతూ– ‘‘నాకు నిర్మాణంపై ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. మొదటి నుంచి వీడియోస్, కవర్‌ సాంగ్స్‌ చేస్తూనే ఉన్నాను. సినిమా నిర్మాణంలోకి రావాలనుకున్నప్పుడు ‘నారాయణ అండ్‌ కో’ సరైన సినిమా అనిపించింది. నాకు వినోదం అంటే చాలా ఇష్టం. ఈ మూవీలో పూర్తి స్థాయి వినోదం పంచే పాత్ర చేసే అవకాశం దక్కింది. ఇక పదేళ్లకు పైగా ఉన్న నా సినీ ప్రయాణంలో రావాల్సినంత ఫేమ్‌ రాలేదు.

‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమా తర్వాత మరో సోలో చిత్రం పడుంటే నా కెరీర్‌ తర్వాతి స్థాయికి వెళ్లేది. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి నాకు మంచి స్నేహితుడు. తన సినిమాలో ఓసారి మంచి పాత్ర చేసే అవకాశం వచ్చింది.. కానీ చేయలేక΄ోయాను. నాకు సరైన పాత్ర ఇవ్వాలని అనిల్‌కి కూడా ఉంది. ‘క్రాక్‌’ సినిమా తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వచ్చాయి. కానీ, నేనే ఆసక్తి చూపలేదు.. లీడ్‌ రోల్స్‌పైనే దృష్టి పెట్టాను. ప్రస్తుతం ‘జీడీ’ (గుండెల్లో దమ్ము) సినిమాతో పాటు 1980 నేపథ్యంలో ఒక ప్రేమకథా చిత్రం చేస్తున్నాను’’ అన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)