Breaking News

అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కిచ్చా.. ఆ లుక్‌తో కనిపించి!

Published on Sun, 08/27/2023 - 15:55

కిచ్చా సుదీప్ ఈ పేరు వింటే చాలా తెలుగువారికి రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమానే గుర్తుకొస్తుంది. ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే ఈ ఏడాది ఆయన నటించిన విక్రాంత్‌ రోణ అభిమానులను పెద్ద ఆకట్టుకోలేదు. అయితే ఇటీవల సుమలత అంబరీష్ బర్త్ డే పార్టీలో కిచ్చా సుదీప్‌ కనిపించారు. ప్రస్తుతం ఆయన కిచ్చా46 చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విక్రాంత్ రోణ సినిమా తర్వాత కిచ్చా సుదీప్ నెక్స్ట్‌ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా కోసం కిచ్చా సుదీప్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా తన న్యూ లుక్‌తో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. 

(ఇది చదవండి: 'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా)

కిచ్చా తన ఇన్‌స్టాలో సిక్స్ ప్యాక్‌తో బాడీని ప్రదర్శిస్తున్న ఫోటోలను పంచుకున్నారు. అయితే ఇదంతా కిచ్చా46 సినిమా కోసమేనని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్‌ కోసం సుదీప్ ఇలా రెడీ అయ్యారంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్‌ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం సుదీప్ తన సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పైల్వాన్ సినిమా కోసం సిక్స్ ప్యాక్‌తో కనిపించారు.

ఇన్‌స్టాలో రాస్తూ..'వర్కవుట్ చేయడం నా సంతోషకరమైన క్షణాలలో ఒకటి. ఇది నన్ను ప్రశాంతంగా ఉంచుతుంది. మిమ్మల్ని దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. కిచ్చా46 చిత్రం క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కోసం మరో నెల సమయం ఉంది. దానికి ముందే ఈ వర్కవుట్‌.' అని సుదీప్‌ రాసుకొచ్చారు. కాగా.. తుపాకి, కబాలి, కర్ణన్, అసురన్‌తో సహా తమిళంలో భారీ బడ్జెట్ చిత్రాలను అందించిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కలైపులి ఎస్ తాను ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

(ఇది చదవండి: పిల్లల ఫోటోలు రివీల్‌ చేసిన నయనతార.. ఈరోజే ఎందుకంటే?)

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)