ఓటీటీకి కిచ్చా సుదీప్‌ యాక్షన్ థ్రిల్లర్‌.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్

Published on Fri, 02/14/2025 - 08:56

శాండల్‌వుడ్ స్టార్ కిచ్చా సుదీప్‌ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్‌ మ్యాక్స్‌. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. టాలీవుడ్‌ నటుడు సునీల్ ఈ మూవీతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమాను వి క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌ థాను నిర్మించారు.

తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ నెల 15 నుంచే జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మొదట ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్‌కు రానుందని భావించారు. కానీ వారం రోజుల ముందుగానే ఓటీటీ ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఈ మేరకు ప్రత్యేత పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకులను అలరించనుంది మ్యాక్స్ మూవీ. ఈ చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ అభిమానులను మెప్పించారు.

మ్యాక్స్ కథేంటంటే..

సస్పెండ్‌ అయిన సీఐ అర్జున్‌ అలియాస్‌ మాక్స్‌(సుదీప్‌ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్‌ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్‌ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్‌లో ఉన్న మంత్రుల  కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్‌ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్‌ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్‌ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ రూప(వరలక్ష్మీ శరత్‌ కుమార్‌), గ్యాంగ్‌స్టర్‌ గని(సునీల్‌) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్‌(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)