Breaking News

నటి మృతి.. మరణానికి కారణమదేనా? వైరలవుతున్న వీడియో!

Published on Thu, 02/23/2023 - 17:59

ప్రముఖ మలయాళ నటి, యాంకర్‌ కమెడియన్‌ సుబి సురేశ్‌ మరణంతో మాలీవుడ్‌లో విషాదం నెలకొంది. గతకొంతకాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూనే తుదిశ్వాస విడిచారు. అయితే సమయానికి తినకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే ఆమె అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆరు నెలల క్రితం ఆమె తన అనారోగ్యం గురించి మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది.

సుబి సురేశ్‌ యూ‍ట్యూబ్‌ ఛానల్‌లో ఉన్న ఆ వీడియోలో తను ఏమందంటే.. 'సమయానికి తినడం, మందులు వేసుకోవడం వంటి మంచి అలవాటు నాకు లేదు. దీనివల్ల ఓసారి షూటింగ్‌కు ముందు రోజు ఛాతీలో నొప్పి వచ్చింది, దీనికి గ్యాస్ట్రిక్‌ సమస్య కూడా తోడైంది. ఆ మరుసటి రోజు నేను ఏదీ తినలేకపోయాను. ఒకటే వాంతులు.. కొబ్బరి నీళ్లు తాగినా కూడా దాన్ని బయటకు కక్కేశాను. రెండు రోజులు ఏమీ తినలేదు. డాక్టర్‌ దగ్గరకు వెళ్తే పొటాషియం చాలా తక్కువగా ఉంది. సరిగా తినాలని చెప్పారు. 

నిజానికి చాలామంది నాకు డబ్బు పిచ్చి అనుకుంటారు. ఫుడ్‌ కూడా తినకుండా డబ్బు వెంట పరుగెడుతుందనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలాకాలం తర్వాత వరుస ప్రాజెక్టులు వస్తుండటంతో కొత్త ఉత్సాహంతో వాటిని చేసుకుంటూ పోయాను. నా ఫోకస్‌ డబ్బు మీద కాకుండా పని మీదే ఉంది. ఈ క్రమంలో సరైన ఫుడ్‌ తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేశాను. ఈ విషయంలో అమ్మ, సోదరుడు నన్ను పదేపదే తిట్టేవారు. నాకు నచ్చినవి పట్టుకొచ్చినా వాటివైపు కన్నెత్తి చూసేదాన్నే కాదు. చెప్పాలంటే నాకు ఆకలిగా ఉన్నా కూడా ఏమీ తినకపోయేదాన్ని. అదే నాకున్న అత్యంత చెడ్డ లక్షణం.

రానురానూ నా శరీరంలో మాగ్నీషియం, పొటాషియం, సోడియం లెవల్స్‌ పడిపోవడంతో నా పరిస్థితి కొంత సీరియస్‌గా మారింది. ముందునుంచే కరెక్ట్‌గా తిని ఉండుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు కదా అనుకున్నా. షూటింగ్‌కు వెళ్లి ఆలస్యంగా వచ్చినప్పుడు డైరెక్ట్‌గా బెడ్‌రూమ్‌కు వెళ్లి పడుకునేదాన్ని. ఏ సాయంత్రానికో లేచేదాన్ని. అప్పుడు కూడా బద్ధకంతో కేవలం నీళ్లు తాగి మళ్లీ నిద్రపోయేదాన్ని. ఇది తరచూ రిపీట్‌ అవడంతో హాస్పిటల్‌లో 10 రోజులు ఉండాల్సింది. కొన్నేళ్లుగా నిర్లక్ష్యంగా ఉన్న నేను ఇప్పుడు రోజుకు మూడు సార్లు తింటున్నాను. కాబట్టి అందరికీ అనుభవంతో చెప్తున్నా.. సమయానికి తినడం అలవాటు చేసుకోండి' అని చెప్పుకొచ్చింది సుబి సురేశ్‌. ఇది చూసిన నెటిజన్లు మీ నిర్లక్ష్యంతో ప్రాణాలే పోగొట్టుకునారు అని కామెంట్లు చేస్తున్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)