Breaking News

పిల్లలు ఇష్టపడే యానిమేటెడ్‌ సిరీస్‌.. ఫ్రీగా చూసేయండి..

Published on Fri, 11/10/2023 - 12:19

చిన్నపిల్లలు అన్నం తినమని మారాం చేసినా, నిద్రపోకుండా ఏడుస్తున్నా పెద్దవాళ్లు కథలు చెప్పేవారు. మరీ ముఖ్యంగా నానమ్మలు, అమ్మమ్మలు కథలు చెప్తూ పిల్లలకు బాల్యం నుంచే నీతి పాఠాలు బోధించేవారు. బడిలో చెప్పని ఎన్నో విషయాలను కథల రూపంలో తెలుసుకునేవారు. ఇప్పుడు ఫోన్‌ల వాడకం పెరిగిపోయాక కథలు చెప్పేవాళ్లే కరువయ్యారు. 

కథలు చెప్తానంటున్న సుధామూర్తి
అయితే టీవీ, ఫోన్‌లోనూ పిల్లల కోసం బోలెడన్ని కార్టూన్‌ చిత్రాలు, యానిమేషన్‌ కథలు, పాటలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో తాను కూడా కథలు చెప్తానంటోంది ఇన్ఫోసిస్‌ చైర్‌ పర్సన్‌, రచయిత్రి సుధామూర్తి. ఆమె చిన్నపిల్లల కోసం ఎన్నో కథల పుస్తకాలు తీసుకొచ్చింది. పిల్లలకు అర్థమయ్యేలా సరళ భాషలో కథలు రాసి ఆకట్టుకుంది. ఈసారి ఓ అడుగు ముందుకువేసి యానిమేటెడ్‌ సిరీస్‌ చేసింది.

తను రాసిన కథలకు, పాత్రలకు ప్రాణం పోసి పిల్లల ముందుకు తీసుకొచ్చింది. 'స్టోరీ టైమ్‌ విత్‌ సుధా అమ్మ' పేరిట యానిమేటెడ్‌ సిరీస్‌ రిలీజ్‌ చేసింది. మూర్తి మీడియా, కాస్మోస్‌ మాయ సంస్థల భాగస్వామ్యంతో ఈ సిరీస్‌ తెరకెక్కింది. మూర్తి మీడియా యూట్యూబ్‌ ఛానల్‌లో ఇది తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్‌ భాషల్లో ప్రసారమవుతోంది. ఈ సిరీస్‌లో మొత్తం 52 కథలు ఉంటాయి. స్టోరీ టైమ్‌ విత్‌ సుధా అమ్మ సిరీస్‌ అక్టోబర్‌ 31 నుంచి యూట్యూబ్‌లో ప్రసారమవుతోంది.

చదవండి: ఆదిపురుష్‌కు పని చేయడమే నేను చేసిన పెద్ద తప్పు.. దేశం వదిలి వెళ్లిపోయా..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)