Breaking News

'ఆ సమయంలో బాధను బయట పెట్టకూడదనుకున్నా': సాయిపల్లవి కామెంట్స్

Published on Wed, 10/30/2024 - 19:28

టాలీవుడ్ నేచురల్ బ్యూటీ ఈ దీపావళికి అభిమానులను పలకరించనుంది. కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కించిన అమరన్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్మీ మేజర్ ముకుంద్‌ వరదరాజన్‌ రియల్‌ లైఫ్‌ స్టోరీనే రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్ కాగా.. ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

అమరన్ ‍ప్రమోషన్లతో బిజీగా ఉన్న సాయిపల్లవి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా అమరన్‌ చిత్ర విశేషాలను పంచుకున్నారు. మేజర్ ముకుంద్‌ కుటుంబాన్ని కలిసినట్లు ఆమె వెల్లడించారు. ఆ సమయంలో తన భావోద్వేగాలను బయట పెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మేజర్ కుటుంబాన్ని కలిసినప్పుడు తాను ఏవిధంగా ఫీలయ్యిందో చెప్పుకొచ్చారు.

సాయిపల్లవి మాట్లాడుతూ.. 'అమరన్ మూవీ భాగంగా మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ ఫ్యామిలీని కలిశా. ఆయన గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నా. ఆయన జీవితం గురించి తెలిశాక బాధగా ఉన్నా కూడా కన్నీళ్లు పెట్టకూడదని డిసైడ్ అయ్యా. తమ బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించాడని వాళ్లు ఎంతో గర్వంగా చెప్పారు. ఇదే విషయాన్ని మేజర్ తండ్రి వరదరాజన్‌ ఎక్కడికెళ్లినా గర్వంగా చెబుతుంటారు. వాళ్లకి లోపల చాలా బాధ ఉన్నప్పటికీ బయటకు కనిపించరు. ఆ కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని' అన్నారు.

పాత వీడియో వైరల్..

అయితే గతంలో సాయిపల్లవి ఇండియన్ ఆర్మీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. మన జవాన్లను టెర్రరిస్ట్‌లతో పోల్చిందంటూ నెటిజన్స్‌ ఆమెను తప్పు పడుతున్నారు. గతంలో ఆమె విరాటపర్వం సినిమా నాటి వీడియో.. తాజాగా అమరన్‌ రిలీజ్ సందర్భంగా నెట్టింట వైరలవుతున్న సంగతి తెలిసిందే.

ఆ వీడియో సాయిపల్లవి మాట్లాడుతూ.. 'పాకిస్తాన్‌లో ఉన్న వాళ్లు.. మన జవాన్లు టెర్రరిస్ట్‌లు అని అనుకుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం.. వాళ్లకు ఏమైనా హాని చేస్తామని భావిస్తారు. అదే సమయంలో మనకు కూడా వాళ్లు అలానే కనిపిస్తారు. ఈ రెండింటి మధ్య మనం చూసే విధానం మారిపోతుంది. ఇందులో ఎవరు రైట్..? ఎవరు రాంగ్..? అని నేను చెప్పలేను.’ అని ఆమె అన్నారు.

కావాలనే చేస్తున్నారు..

అయితే సాయిపల్లవి కామెంట్స్‌పై బాలీవుడ్‌ ఇండస్ట్రీ వాళ్లే కొందరు కావాలని అలా ప్రచారం చేస్తున్నారని మరో టాక్ వినిపిస్తోంది. అయితే సాయిపల్లవి బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్‌ సరసన రామాయణ చిత్రంతో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్మీపై ఆమె చేసిన కామెంట్స్‌ వల్ల సీత పాత్రలో సాయి పల్లవిని తొలగించాలంటూ కొందరు కావాలనే టార్గెట్ చేశారని మరికొందరు అంటున్నారు. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)