Breaking News

‍హీరో డైరెక్షన్‌లో నటించనున్న స్టార్ హీరోయిన్..!

Published on Wed, 03/27/2024 - 14:44

కోలీవుడ్ నటుడు శశికుమార్‌ దర్శకత్వంలో నటించేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతార పచ్చజెండా ఊపారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. సుబ్రమణ్యపురం చిత్రం ద్వారా కథానాయకుడు, దర్శకుడిగా పరిచయమైన  శశికుమార్‌ ఆ తరువాత నాడోడిగళ్‌ చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించడంతో శశికుమార్‌ హీరోగా స్థిరపడిపోయారు. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఈయన ఈ మధ్య కథానాయకుడిగా నటించిన అయోథి చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది.  

ఇక నటి నయనతార విషయానికి వస్తే లేడీ సూపర్‌స్టార్‌గా ఆమె రాణిస్తున్నారు. ఇటీవల జవాన్‌ చిత్రంతో బాలీవుడ్‌లోనూ విజయాన్ని అందుకున్నారు. గతేడాది ఆమె ఎన్నో అంచనాలు పెట్టుకున్న తన 75వ చిత్రం అన్నపూరణి తీవ్ర నిరాశ పరిచింది. అంతే కాకుండా వివాదాల్లో చిక్కుకుని కేసుల వరకూ వెళ్లి ఓటీటీలో నుంచి తొలగించారు. ఇదిలా ఉండగా.. నయన్‌కు అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే విజయాలే ముఖం చాటేస్తున్నాయి. ప్రస్తుతం టెస్ట్‌ అనే క్రికెట్‌ నేపథ్యంలో సాగే చిత్రంతో పాటు మన్నాంగట్టి అనే హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

కాగా తాజాగా నటుడు శశికుమార్‌ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే వార్త సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల‌వుతోంది. ఇదీ హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇందులో నయనతార పాత్ర చాలా బలంగా ఉంటుందని తెలిసింది. ఈ చిత్రానికి శశికుమార్‌ దర్శకత్వం మాత్రమే చేయనున్నట్లు.. నటన జోలికి వెళ్లడం లేదని సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు