Breaking News

ఖైదీ భార్య పాత్రలో..?

Published on Fri, 06/13/2025 - 04:42

దిల్లీ తిరిగి సెట్స్‌కి వస్తున్నాడు. లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న సినిమా ‘ఖైదీ 2’. కార్తీ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఖైదీ’. 2019లో విడులై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో వెంటనే ‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఖైదీ 2’ ప్రకటించారు లోకేశ్‌–కార్తీ. కానీ దర్శకుడు లోకేశ్‌ వరుసగా కమల్‌హాసన్‌తో ‘విక్రమ్‌’, రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమాలు చేయాల్సి రావడంతో, ‘ఖైదీ 2’ సినిమా చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. ఇక ‘విక్రమ్‌’ (2022) సినిమా విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

‘కూలీ’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం ‘ఖైదీ 2’ సినిమాపై ఫోకస్‌ పెట్టారు కార్తీ–లోకేశ్‌. అయితే ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ ‘ఖైదీ 2’లో అనుష్కా శెట్టి ఓ లీడ్‌ క్యారెక్టర్‌ చేయనున్నట్లుగా కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ‘ఖైదీ’లో కార్తీ కుమార్తె పాత్రను పరిచయం చేశారు. కానీ భార్య పాత్ర గురించి సరైన ప్రస్తావన లేదు. దీంతో ‘ఖైదీ 2’ సినిమాలో ఆ పాత్ర ప్రస్తావన ఎక్కువగా స్క్రీన్‌పై ఉంటుందని, ఈ పాత్రలోనే అనుష్కా శెట్టి నటించనున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది.

అలాగే ‘ఖైదీ’లో పోలీసాఫీసర్ల పాత్రలు ఎక్కువగా ఉంటాయి. మరి... ‘ఖైదీ’ (కార్తీ) భార్య పాత్రలో అనుష్కా శెట్టి నటిస్తారా? లేక పోలీసాఫీసర్‌ రోల్‌ చేస్తారా? అనే విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు. ఇక ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ఈ ఏడాది సెప్టెంబరులో ప్రారంభించి, వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్‌ చేయాలనిప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)