Breaking News

లోకేష్‌ కనగరాజ్‌ చిత్రం.. స్టార్ హీరోయిన్ అవుట్!!

Published on Sun, 10/08/2023 - 07:05

కోలీవుడ్‌లో ప్రస్తుతం క్రేజీ దర్శకుడు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు  లోకేష్‌ కనగరాజ్‌. సినిమా ఆశతో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి చిత్రరంగ ప్రవేశం చేసిన ఈయన తొలి చిత్రం మా నగరం నుంచి విక్రమ్‌ వరకు ఒకదాని మించిన ఒక హిట్‌ అందుకుంటూ వచ్చారు. తాజా విజయ్‌ కథానాయకుడిగా లియో చిత్రాన్ని పూర్తి చేశారు. ఈనెల 19వ తేదీన తెరపైకి రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు  నెలకొన్నాయి. 

(ఇది చదవండి: ఎలిమినేషన్‌కి ముందే మరో ట్విస్ట్.. ఆ ముగ్గురిపై వేలాడుతున్న కత్తి!)

ఈ మూవీ తర్వాత రజినీకాంత్‌ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది దర్శకుల బాటలోనే లోకేష్‌ కనగరాజ్‌ కూడా నిర్మాతగా అవతారం ఎత్తుతున్నారు. ఈయన తన శిష్యుడు రత్నకుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రాఘవ లారెన్స్‌, నయనతార ప్రధాన పాత్రలో ఒక హారర్, థ్రిల్లర్‌ కథా చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈచిత్రానికి లోకేష్‌ కనకరాజ్‌ కథ, కథనం బాధ్యతలను నిర్వహించనున్నట్లు తెలిసింది. 

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నుంచి నయనతార వైదొలగినట్లు తెలిసింది. ఇటీవలే జవాన్‌ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నయనతార ఆ చిత్ర సంచలన విజయంతో భారతీయ సినిమాలో మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు. కాగా జయం రవి సరసన నటించిన ఇరైవన్‌ చిత్రం ఇటీవల విడుదలై ఆశించిన విజయాన్ని సాధించకపోయినా నయనతార క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. తన 75వ చిత్రంతో పాటు టెస్ట్‌, మన్నాంగట్టి సీన్స్‌ 1960 పెదరా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

(ఇది చదవండి: నాపై రాసిన ఆ వార్తలు చదివి కుమిలిపోయా: స్వాతి)

జవాన్‌ చిత్రం తర్వాత హిందీలోనూ అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. మరోపక్క తన సొంత నిర్మాణ సంస్థ రవి పిక్చర్స్‌ పతాకమైన చిత్రాలు నిర్మించడం డిస్ట్రిబ్యూషన్‌ చేయడం కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే ఇతర వ్యాపార రంగంలోనూ విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కొంత సమయాన్ని తన పిల్లల కోసం కేటాయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్‌ కనగరాజ్‌ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి అని సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం. 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?